ఏడు కొండలపై టెక్నాలజీ విప్లవం.. ఆ 7 అద్భుతాలు ఏంటి ??

ఏడు కొండలపై టెక్నాలజీ విప్లవం.. ఆ 7 అద్భుతాలు ఏంటి ??


కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం ఇప్పుడు సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కేవలం భక్తి భావనకే పరిమితం కాకుండా, పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకోవడానికి, పారదర్శకతను పెంచడానికి, భద్రతను కట్టుదిట్టం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అస్త్రంగా మార్చుకుంది. “గోవిందా” నామ స్మరణతో మారుమోగే ఏడుకొండలపై ఇప్పుడు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పహారా కాస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, టీటీడీ ఇప్పుడు ఏడు రకాల కీలక సాంకేతికతలను అమలు చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల సాంకేతికతలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్.. దీనినే సింపుల్‌గా ICCC గా పిలుస్తారు. తిరుమల చరిత్రలో ఇదొక మైలురాయి. ఎన్నారై దాతల సహకారంతో సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒక కంట్రోల్ రూమ్ మాత్రమే కాదు, తిరుమల మొత్తం యంత్రాంగానికి ‘బ్రెయిన్‌’ వంటిదన్నమాట. క్యూ లైన్లలో భక్తుల రద్దీని 3D మ్యాప్‌ల ద్వారా విశ్లేషిస్తారు. దర్శన సమయం అంచనా వేస్తారు. భక్తులు ఏ కంపార్ట్‌మెంట్‌లో ఉన్నారు? వారికి స్వామివారి దర్శనం కలగడానికి ఇంకా ఎన్ని గంటల సమయం పడుతుంది? అనే అంశాలను ఏఐ ఖచ్చితంగా లెక్కగట్టి భక్తులకు ముందే సమాచారం అందిస్తుంది. దీనివల్ల భక్తులు మానసికంగా సిద్ధపడే అవకాశం ఉంటుంది. ఇక మరో విషయం ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ దీనినే తెలుగులో ముఖ గుర్తింపు సాంకేతికత అని అంటారు. దర్శనం టికెట్ల జారీలో, లడ్డూ ప్రసాదం పంపిణీలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఒకే వ్యక్తి పదేపదే రాకుండా నిరోధిస్తారు. సర్వదర్శనం టోకెన్లు పొందే సమయంలో భక్తుల ముఖాలను స్కాన్ చేస్తారు. దీనివల్ల అనధికారికంగా టికెట్లు పొందే వారిని అడ్డుకోవడం ఈ టెక్నాలజీ స్పెషాల్టీ. టీటీడీ అందిస్తున్న సేవలు ఎంతమందికి చేరుతున్నాయి, ఎక్కడ జాప్యం జరుగుతోంది అనేది ఈ డేటా ద్వారా విశ్లేషిస్తారు. ఇక మూడోది అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్.. దీని ద్వారా PPM అంటే Parts Per Million స్థాయిలో తనిఖీల నిర్వహిస్తారు. శ్రీవారి ప్రసాదం అంటే భక్తులకు మహా ప్రాణం. ఈ ప్రసాదాల తయారీలో వాడే ముడి సరుకుల నాణ్యత విషయంలో గతంలో కొన్ని వివాదాలు వచ్చిన నేపథ్యంలో, టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.PPM స్థాయిలో తనిఖీలు అంటే అత్యంత సూక్ష్మమైన కల్తీని కూడా ఈ ల్యాబ్ పసిగట్టగలదు. కేవలం నెయ్యి, పాలు మాత్రమే కాకుండా, భక్తులు తాగే నీటిని, వంటకు వాడే నీటిని కూడా ఇక్కడ నిరంతరం పరీక్షిస్తారు. ఇక నాలుగోది ఈ-నోస్ మరియు ఈ-టంగ్ పరికరాలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు స్వచ్ఛమైన నెయ్యిని శ్రీవారి కోసం వాడుతుంటారు. ఈ నెయ్యి స్వచ్ఛతను పరీక్షించడానికి ఫ్రాన్స్ దేశపు సాంకేతికతను వాడుతున్నారు. మనుషులు కనిపెట్టలేని తేడాలను ఈ పరికరాలు గుర్తిస్తాయి. 3 కోట్ల రూపాయల విలువైన ఈ ‘ఎలక్ట్రానిక్ ముక్కు మరియు నాలుక’ నెయ్యిలో స్వల్పంగా ఇతర నూనెలు కలిసినా వెంటనే అలర్ట్ చేస్తాయి. నెయ్యిలో ఉండే రసాయనాలు లేదా ఇతర మలినాలను 200 పారామీటర్లలో ఈ ల్యాబ్ పరీక్షిస్తుంది. ఇక అలిపిరి మార్గంలో ఏఐ పహారా & డ్రోన్ నిఘా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భక్తుల భద్రత విషయంలో రాజీ పడకుండా తిరుమలకు వెళ్లే నడక మార్గాల్లో మరియు ఘాట్ రోడ్లలో నిఘాను కట్టుదిట్టం చేశారు. విద్యుత్ సౌకర్యం లేని చోట కూడా పనిచేసేలా సోలార్ ఆధారిత ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల నిఘాతో 400 మీటర్ల దూరం వరకు వన్యప్రాణుల కదలికలను ఇవి గుర్తించగలవు. చిరుతలు లేదా ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు భక్తుల మార్గంలోకి వస్తే, వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలారం అందుతుంది. తద్వారా వెంటనే భక్తులను అప్రమత్తం చేయవచ్చు. డిజిటల్ టెండరింగ్ మరియు పారదర్శక కొనుగోళ్లకు సంబంధించి కూడా టెక్నాలజీని టీటీడీ ప్రవేశపెట్టింది. టీటీడీ ఏటా దాదాపు రూ. 700 కోట్ల విలువైన 97 రకాల దినుసులను కొనుగోలు చేస్తుంది. ఇందులో అవినీతికి తావు లేకుండా ఉండేందుకు పూర్తిస్థాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ కొందరు వ్యాపారులు సిండికేట్ అయి ధరలు పెంచకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. టెండర్ల ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగడం వల్ల కక్కుర్తి పడే అధికారులకు, దళారీలకు చెక్ పెట్టే ప్రక్షాళన ఇది. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ షూ కీపింగ్ సిస్టమ్ గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలి. తిరుమలలో చెప్పుల స్టాండ్ల దగ్గర ఉండే రద్దీ, చెప్పులు పోతాయేమో అన్న భయం భక్తులను ఇబ్బంది పెడుతుంటుంది. దీనికి పరిష్కారంగా ‘కోరమండల్ ఇంటర్నేషనల్’ సహకారంతో స్మార్ట్ సిస్టమ్‌ను తెచ్చారు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. భక్తులు తమ పాదరక్షలను ఇచ్చేటప్పుడు ఒక క్యూఆర్ కోడ్ స్లిప్ ఇస్తారు. దర్శనం ముగించుకుని రాగానే ఆ కోడ్ స్కాన్ చేస్తే చాలు, సెకన్ల వ్యవధిలో వారి చెప్పులను అప్పగిస్తారు. దీనివల్ల క్యూ లైన్లలో గందరగోళం తగ్గుతుంది. టెక్నాలజీని కేవలం వ్యాపారాలకే కాకుండా, ఆధ్యాత్మిక సేవలో ఎలా వినియోగించవచ్చో టీటీడీ నిరూపిస్తోంది. భక్తులకు కల్పించే సౌకర్యాలు, భద్రత, మరియు ప్రసాదాల నాణ్యతలో ఏఐ వాడకం అనేది భవిష్యత్తులో ఇతర దేవాలయాలకు కూడా మార్గదర్శకం కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ చిన్న మార్పు చేసుంటే.. ఉస్తాద్ ఇంకా బాగా ఆడేది

Kalyan Padala: హీరోగా కళ్యాణ్‌ పడాల.. మొదటి అడుగు పడింది

Mangli: పక్కా ప్రణాళిక.. 200కోట్ల వసూళ్లు.. కానీ నాకేం సంబంధం లేదంటున్న మంగ్లీ

Akshay Kumar: స్టార్ హీరో కూతురికి వేధింపులు..

Varanasi: ‘వారణాసి’ స్పెషల్‌ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *