Tollywood : ఆయన చనిపోవడానికి కారణం అదే.. ఆ రోజు కారులో నేను కూడా ఉన్నా.. రాజేంద్ర ప్రసాద్..

Tollywood : ఆయన చనిపోవడానికి కారణం అదే.. ఆ రోజు కారులో నేను కూడా ఉన్నా.. రాజేంద్ర ప్రసాద్..


టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో హీరోగా, సహాయ నటుడిగా అలరిస్తున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రముఖ నటుడు నూతన ప్రసాద్ కారు ప్రమాదం వెనుకటి షాకింగ్ వివరాలను వెల్లడించారు. ఒక సినిమా షూటింగ్ కోసం కార్లను గాల్లో ఎగురుతూ, కిందకు వస్తూ, విడిపోయి మళ్లీ కలిసినట్లు చూపించేందుకు ప్రత్యేక సాంకేతిక పద్ధతులు వాడారని అన్నారు. AVM స్టూడియోలో ఆరు కార్లను ఈ స్టంట్‌కు ఉపయోగించారని… వీటిలో రెండు కార్లను రెండు భాగాలుగా చేసి, వెనుక భాగానికి స్కూటర్ ఇంజిన్ అమర్చారని గుర్తు చేసుకున్నారు. అయితే క్రేన్‌కు కట్టి, గొలుసులతో కార్ డాన్స్ చేయిస్తుండగా, గొలుసు తెగిపోయి ప్రమాదం జరిగిందని అన్నారు.. వాస్తవానికి, నూతన ప్రసాద్ గారే షాట్ నచ్చక తిరిగి తీయమని అడిగారని.. కారును మళ్ళీ పైకి ఎత్తుతుండగా, కెమెరామ్యాన్ క్లోజప్‌కు తక్కువ ఎత్తు చాలని చెప్పడంతో, వెంటనే ఆపారు. అయితే ఆ అకస్మాత్తుగా ఆపడం వలన కారు పట్టుతప్పి 18 అడుగుల ఎత్తు నుంచి నేరుగా కిందపడిందని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

ప్రమాదం జరిగినప్పుడు తాను డ్రైవింగ్ సీట్లో ఉండగా, నూతన ప్రసాద్ వెనుక సీట్లో ఉన్నారు. కారు కిందపడిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ కిందకు వంగడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ వెనుక సీట్లో ఉన్న నూతన ప్రసాద్ కారు ధాటికి వెన్నెముకలోని 16, 17 నంబర్ ఎముకలు దెబ్బతిని, ఆయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఈ విషాద ఘటన తరువాత, నూతన ప్రసాద్ తన పరిస్థితిని తలచుకుని బాధపడేవారు. తాను, రాజేంద్ర ప్రసాద్ ఒకే కారులో ఒకే చోట నుంచి పడినా, తనకు ఈ గతి ఎందుకు పట్టిందని తరచు అడిగేవారు.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

రాజేంద్ర ప్రసాద్ ఆయనను ఓదార్చుతూ, ఇది భగవంతుని నిర్ణయం కావచ్చని చెప్పేవారు. ఈ ప్రమాదం తర్వాత నూతన ప్రసాద్ కొంతకాలం డబ్బింగ్ కళాకారుడిగా, చిన్న చిన్న పాత్రలలో నటించి జీవనం సాగించారు. కానీ ప్రమాదం వలన వచ్చిన ఆరోగ్య సమస్యలతో కొంతకాలానికి ఆయన కన్నుమూశారు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో ఒక విషాద అధ్యాయంగా మిగిలిపోయిందని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *