Headlines

OTT Movie: నేషనల్ హైవేపై వరుస హత్యలు.. తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఓటీటీలో ఈ సినిమాను చూశారా?

OTT Movie: నేషనల్ హైవేపై వరుస హత్యలు.. తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఓటీటీలో ఈ సినిమాను చూశారా?


ఇప్పుడు ఓటీటీలైనా, థియేటర్లయినా రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా తెరకెక్కే సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఇప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందులోనూరియల్ క్రైమ్ స్టోరీలనైతే ఎగబడి చూస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గటుగానే ఓటీటీల్లో పలు రియల్ క్రైమ్ స్టోరీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా సేమ్ టు సేమ్ అలాంటి ఓ సినిమా గురించే. కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని ఓ జాతీయ రహదారిపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నేషనల్ హైవేలోని ఒక‌ ప్రదేశంలో, ఒకే విధంగా వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు ఈ సీరియల్ మర్డర్స్ వెనక మర్మమేమిటి? దాని వెనక ఉన్నది ఎవరన్నదే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్.. కథ విషయానికి వస్తే.. హీరోయిన్ కుటుంబ సభ్యులు కూడా ఈ హైవేలోనే ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఆమె ఆ హైవేలో ఉన్న మిస్టరీని తెలుసుకునేందుకు హీరోయిన్ స్వయంగా రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తన కుటుంబ సభ్యులు చనిపోవడానికి ప్రమాదం కారణం కాదనీ, దీని వెనక ఓ పక్కా ప్లాన్ ఉందని తెలుసుకుంటుంది.

మరి ఆ సీరియల్ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? అసలు ఆ హంతకుల ఉద్దేశమేంటి? చివరకు హీరోయిన్ కరడుగట్టిన హంతకులను ఎలా పట్టుకుంది? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠభరితమైన సీన్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమా పేరు ది రోడ్. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది ఈ మూవీ క్యాప్షన్‌ . అరుణ్ వశీగరన్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో త్రిష ప్రధాన పాత్ర పోషించింది. అలాగే మలయాళ‌ నటుడు షబీర్ కీ రోల్‌ పోషించాడు. ఇక త్రిష ఫ్రెండ్ గా మియా జార్జ్, కానిస్టేబుల్ పాత్రలో భాస్కర్ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించారు. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన‌ ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ది రోడ్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *