Delhi Petrol Pumps: ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలకు ఒక ముఖ్యమైన వార్త ఉంది. ముఖ్యంగా వాహన యజమానులకు ఒక కొత్త నిబంధన వచ్చింది. అదేమిటంటే, మీ వాహనానికి సంబంధించిన కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (PUC) మీ వద్ద లేకపోయినా లేదా దాని గడువు తేదీ ముగిసినా, మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. పెట్రోల్ బంకులలో ఇంధనం కొనుగోలు చేసే నిబంధనలు ఇప్పుడు పూర్తిగా మార్పలు చేశారు.
చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ లేకుండా ఢిల్లీలోని ఏ పెట్రోల్ బంకులోనూ ఇంధనం వేయరాదని ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాలుష్యానికి వాహనాల నుండి వెలువడే పొగ ఒక ప్రధాన కారణమని ప్రభుత్వం చెబుతోంది. ఈ చర్య కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను నియంత్రిస్తుందని కూడా చెప్పబడింది. ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కఠినమైన నిర్ణయం ప్రస్తుత అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.
ఇది కూడా చదవండి: Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? తక్కువ వడ్డీ అని మురిసిపోకండి.. కనిపించని ఈ ఛార్జీల గురించి తెలిస్తే షాకవుతారు!
ఇవి కూడా చదవండి
అన్ని రకాల ఇంధనాలకు..
ఈ కొత్త నిబంధన పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలకు మాత్రమే పరిమితం కాదు. వాహనం కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం చెల్లుబాటులో ఉంటేనే పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీని సరఫరా చేయాలని ఢిల్లీలోని పెట్రోల్ స్టేషన్లు, గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం.
ఒక సంవత్సరం తర్వాత సర్టిఫికేషన్ తప్పనిసరి:
కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం, రిజిస్ట్రేషన్ అయిన ఒక సంవత్సరం తర్వాత ప్రతి వాహనానికి చెల్లుబాటు అయ్యే పీయూసీ (PUC) సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటి వరకు చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ పత్రం లేకుండా మీ వాహనంలో పెట్రోల్ నింపరు. ఈ ఆదేశాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంకులకు సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
GRAP నిబంధనల ప్రకారం కీలక చర్య:
వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) జారీ చేసిన సవరించిన GRAP మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి, PUC నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని GRAP మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఈ నిర్ణయం వాహనదారులకు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఇది సరైన నిర్ణయంగానే పరిగణిస్తున్నారు.
ఢిల్లీ ప్రభుత్వ ఈ ఉత్తర్వు కాలం చెల్లిన వాహనాలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఢిల్లీలో 15 సంవత్సరాల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలకు, 10 సంవత్సరాల కంటే పాతవైన డీజిల్ వాహనాలకు పీయూసీ (PUC) సర్టిఫికేట్లు జారీ చేయలేరు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 (సబ్-రూల్ 7) ప్రకారం, వాహనాల రిజిస్ట్రేషన్ తర్వాత ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉన్న పీయూసీ (PUC) సర్టిఫికేట్ కలిగి ఉండటం, అధికారులు అడిగినప్పుడు దానిని చూపించడం తప్పనిసరి.
గమనిక: వాహన కాలుష్యం పెరగకుండా ఉండటమే కాకుండా, భారీ జరిమానాల నుండి తప్పించుకోవడానికి వాహనదారులు తమ పీయూసీ గడువును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మంచిది.
Silver Price: అనుకున్నదే జరుగుతుందా? భారీగా పడిపోతున్న వెండి ధర.. పాతాళానికి చేరుతుందా? నిపుణుల అంచనా ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి