నికోలస్ పూరన్ అంటేనే మైదానంలో సిక్సర్ల వర్షం. తన సుదీర్ఘ టీ20 కెరీర్‌లో 449 మ్యాచ్‌లు ఆడిన పూరన్, ఏకంగా 715 సిక్సర్లు బాదాడు. 147.32 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసే ఈ మొనగాడు, క్రీజులోకి వస్తే మ్యాచ్ ఫలితం తలకిందులు కావాల్సిందే. మొత్తం 10,422 పరుగుల భారీ రికార్డు ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2026లో మాత్రం అతని మ్యాజిక్ పూర్తిగా మాయమైనట్లు కనిపిస్తోంది. పవర్‌ఫుల్ హిట్టర్‌గా పేరున్న పూరన్, ప్రస్తుత సీజన్‌లో తన నీడలా కూడా ఆడలేకపోతున్నాడు.