బంగ్లాదేశ్‌కు చెందిన 24 ఏళ్ల మేధావి విద్యార్థి జయతు చౌదరి కథ ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. కంప్యూటర్ సైన్స్ చదువుతూ, ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన ఒక విద్యార్థి.. నెలల తరబడి ఇమ్మిగ్రేషన్ నిర్బంధంలో గడిపి, చివరికి మానసికంగా కుంగిపోయి, తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అసలు జయతు చౌదరి విషయంలో ఏం జరిగింది? అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని ఎలా ఇబ్బంది పెట్టారు? అంతర్జాతీయ విద్యార్థులు చేయకూడని ఆ తప్పులేంటి? వంటి అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. జయతు చౌదరి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, తన ప్రతిభతో అమెరికాలోని ఇల్లినాయిస్ వెస్లియన్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. ఫైనాన్స్ , కంప్యూటర్ సైన్స్ వంటి డిమాండ్ ఉన్న సబ్జెక్టులను ఎంచుకున్నాడు. డిసెంబర్ 2021లో ఎఫ్-1 స్టూడెంట్ వీసాపై అమెరికాలోకి ఎంతో ఆశతో అడుగుపెట్టాడు.కేవలం చదువుకోవడమే కాదు, అక్కడ స్థిరపడి శాశ్వత నివాసం పొందేందుకు చట్టబద్ధమైన మార్గాలను కూడా అన్వేషించాడు. కానీ, విధి అతడిని మరో వైపు తీసుకెళ్లింది. ఆగస్టు 2025లో అనుకోని విధంగా అతని వీసా హోదాను రద్దు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్.. రీజనేంటి?
పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?
పాన్ ఇండియా హిట్ వరమా..శాపమా?
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?
సమ్మర్ హీట్.. లైట్ అంటున్న స్టార్స్