ఫోన్, కెమెరా వేడెక్కుతున్నాయా? ఈ కూలింగ్ గాడ్జెట్స్‌తో మీ సమస్యకు చెక్

ఫోన్, కెమెరా వేడెక్కుతున్నాయా? ఈ కూలింగ్ గాడ్జెట్స్‌తో మీ సమస్యకు చెక్


నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ గేమ్స్, సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అయితే గంటల తరబడి ఫోన్‌లో హై-గ్రాఫిక్ గేమ్స్ ఆడటం వల్ల లేదా ఎండలో వీడియో షూటింగ్స్ చేయడం వల్ల ఫోన్లు, కెమెరాలు విపరీతంగా వేడెక్కుతుంటాయి. ఈ ఓవర్ హీటింగ్ కారణంగా డివైజ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడమే కాకుండా, హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఇవోఫాక్స్’ ఇంకా ‘జెర్బెస్’ కంపెనీలు సరికొత్త కూలింగ్ గాడ్జెట్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

స్మార్ట్‌ఫోన్ కూలర్..

ఇవోఫాక్స్ ఫోన్ కూలర్ 15 వాట్స్ పవర్‌తో, నిమిషానికి 5000 ఆర్‌పీఎమ్ (RPM) వేగంతో తిరిగే 7-బ్లేడ్ల ఫ్యాన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మూడు రకాల కూలింగ్ మోడ్స్ ఉండటం వల్ల అవసరాన్ని బట్టి చల్లదనాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. గది ఉష్ణోగ్రతను తెలియజేయడానికి రియల్-టైమ్ టెంపరేచర్ డిస్‌ప్లే, గేమింగ్ లుక్ కోసం వైబ్రంట్ ఆర్‌జీబీ లైటింగ్ దీని ప్రత్యేకత. కేవలం 78 గ్రాముల బరువు ఉండే ఈ కూలర్ క్లాంప్ మౌంట్ డిజైన్‌తో వస్తుంది, కాబట్టి ఏ రకమైన స్మార్ట్‌ఫోన్‌కైనా సులభంగా అటాచ్ చేయవచ్చు. దీనికి టైప్-సీ పవర్ ఇన్‌పుట్ సదుపాయం కూడా ఉంది, ఇది లాంగ్ గేమింగ్ సెషన్స్ చేసేవారికి ఎంతో ఉపయోగకరం.

కెమెరా కూలర్..

ప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది, ఫొటోగ్రాఫర్లు గంటల తరబడి ఎండలో లేదా భారీ స్టూడియో లైట్ల కింద షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో కెమెరాలు వేడెక్కి పని చేయడం ఆగిపోయే ప్రమాదం ఉంది. జెర్బెస్ కంపెనీ తెచ్చిన కూలింగ్ ఫ్యాన్ కెమెరా బాడీకి పర్ఫెక్ట్‌గా అటాచ్ అయ్యి వేడిని వేగంగా తగ్గిస్తుంది. ఇందులో 5 స్పీడ్ కూలింగ్ మోడ్స్ ఉండటం వల్ల ఎయిర్ ఫ్లోను నియంత్రించుకోవచ్చు. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ కూలర్‌లో బ్యాటరీ పర్సంటేజ్‌ను చూపే ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది.

సిలికాన్ మెటీరియల్‌తో తయారైన ఈ లైట్‌వెయిట్ కూలర్ ఇన్​ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఒక వరమనే చెప్పాలి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం వాడే పరికరాలు కూడా అధునాతనంగా మారుతున్నాయి. ఓవర్ హీటింగ్ సమస్య వల్ల మీ విలువైన ఫోన్ లేదా కెమెరా పాడవకుండా ఉండాలంటే ఇలాంటి కూలింగ్ గాడ్జెట్స్ వాడటం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *