కళ తప్పిన బాక్సాఫీస్.. హిట్ వచ్చేదెప్పుడు గురు ??

కళ తప్పిన బాక్సాఫీస్.. హిట్ వచ్చేదెప్పుడు గురు ??


టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డల్ పీరియడ్ కంటిన్యూ అవుతుందా..? ఇంకెన్నాళ్లు ఇలాగే ఉండాలి..? గతవారం వచ్చిన సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయా..? కనీసం మే నెల్లో వచ్చే కొత్త సినిమాలైనా బయ్యర్ల కష్టాలను తీరుస్తాయా..? హిట్లు లేక కళ తప్పిన టాలీవుడ్‌కి బ్లాక్‌బస్టర్ కళ ఎప్పుడు వస్తుంది..? బాక్సాఫీస్ దగ్గర మరో వీక్ కూడా సైలెంట్‌గానే గడిచిపోయింది, థియేటర్లలోకి వచ్చిన నాగశౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా అసలు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియలేదు. విడుదలై 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అడివి శేష్ డెకాయిట్ సినిమానే కాస్తో కూస్తో కలెక్షన్స్ రాబడుతూ కనిపిస్తోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ఏకంగా 40 కొత్తవాళ్లతో నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకి బాగానే కనెక్ట్ అయింది. కంటెంట్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఈ సినిమా థియేటర్ల దగ్గర మరీ అంత పెద్దగా సందడి అయితే చేయడం లేదు. కొత్తవాళ్లు కావడంతో ఉన్నంతలో పర్లేదనిపిస్తుంది తిమ్మరాజుపల్లి టీవీ. తిరువీర్ హీరోగా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాపం ప్రతాప్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కమర్షియల్‌గా మాత్రం ప్రతాప్ కాస్త వెనుకబడిపోయిందనే చెప్పాలి. కాకపోతే చూసిన వాళ్లు మాత్రం కొత్తగా ట్రై చేసారనే ప్రశంసలు అయితే వస్తున్నాయి. గత వారం సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇక బయ్యర్లు తమ ఆశలన్నీ మే 1న రాబోయే కొత్త సినిమాలపైనే పెట్టుకున్నారు. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమాతో పాటు కమెడియన్ సత్య నటిస్తున్న జెట్లీ సినిమాలు బాక్సాఫీస్‌కు ఏ మేరకు బూస్టప్ ఇస్తాయో చూడాలి. మొత్తానికి చూడాలిక ఈ డ్రై రన్‌కు ఎండ్ కార్డ్ పడేదెప్పుడో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..

వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త

త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు

పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి ‘మెషిన్ గన్’

రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *