మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..


సాధారణంగా మూడు నెలల వయసున్న పిల్లలు ఎలా ఉంటారు? నేలపై పాకడం, బోర్లా పడటం, నవ్వడం వంటి చిన్న చిన్న పనులు నేర్చుకునే దశలో ఉంటారు. అలాంటిది బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల, యష్ వీరగోని దంపతుల గారాల పట్టి ‘శిఖ వీరగోని’ మాత్రం అప్పుడే గిన్నిస్ రికార్డులకెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుని చిన్న వయసులోనే సంచలనం సృష్టించింది. శిఖ వీరగోని, కేవలం 3 నెలల 29 రోజుల వయసులోనే ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అదేంటంటే.. ‘లాంగెస్ట్ డ్యూరేషన్ బై యాన్ ఇన్ఫాంట్ మెయింటైనింగ్ అసిస్టెడ్ అప్రైట్ బ్యాలెన్స్ ఆన్ ఏ పేరెంట్స్ పామ్’ అంటే నాన్న అరచేతిపై నిటారుగా బ్యాలెన్స్ చేస్తూ నిలబడటం అనే విభాగంలో ఈ బుడ్డిది రికార్డు సాధించింది. తన తండ్రి అరచేతిపై ఏకంగా 2 నిమిషాల 43 సెకన్ల పాటు నిలబడి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది శిఖ. కేవలం గిన్నిస్ రికార్డు మాత్రమే కాదు, ఈ చిన్నారి ఏకకాలంలో ఐదు ప్రధాన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శిఖ స్థానం దక్కించుకుంది. బహుశా ఇంత చిన్న వయసులో ఇన్ని రికార్డులు సాధించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావచ్చేమో…! అందుకే తమ కూతురి రేర్ ఫీట్ ను చూసి సోనియా దంపతులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారి ‘శిఖ’ చేసిన ఈ రేర్ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చిన్నారి తన తండ్రి అరచేతిపై నిలబడి, ఆయన కళ్లలోకి చూస్తూ నవ్వుతున్న తీరు నెటిజన్లను కట్టిపడేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Asha Bhosle: ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం

Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

Dacoit: కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *