Headlines

స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!


పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం మరొక సంచలనాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పాఠశాలల పరిసరాల్లో చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ వంటి జంక్ ఫుడ్ అమ్మకాలపై పూర్తిస్థాయి నియంత్రణ విధించేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కఠిన నిబంధనలను తీసుకువస్తోంది.

కొత్తగా ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం, ఏ పాఠశాల క్యాంపస్ సరిహద్దు నుంచైనా 50 మీటర్ల పరిధిలో ఎక్కువ కొవ్వు, అధిక చక్కెర, ఉప్పు కలిగిన ఆహార పదార్థాలను విక్రయించడం నిషిద్ధం. అంతేకాకుండా, పాఠశాలల సమీపంలో ఇటువంటి జంక్ ఫుడ్ ఉత్పత్తులకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు, హోర్డింగ్‌లు పెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించనున్నారు.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు:

నేటి తరం పిల్లల్లో శారీరక శ్రమ తగ్గి, జంక్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల చిన్నతనంలోనే బరువు పెరగడం, ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కోల్డ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్నారులలో టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, దంత సమస్యలు, జీర్ణక్రియ లోపాలు చిన్న వయసులోనే వస్తున్నాయి. చిన్నతనం నుంచే పిల్లల్లో సరైన పోషకాహార అలవాట్లను పెంపొందించడం అత్యంత ఆవశ్యకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి



పాఠశాల యాజమాన్యాల బాధ్యత:

ఈ నిబంధనల ప్రకారం, పాఠశాల క్యాంటీన్లలో కేవలం పోషకాలతో కూడిన పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలి. పండ్ల రసాలు, పాలు, లస్సీ, తృణధాన్యాలతో చేసిన వంటకాలు మరియు పండ్లను ప్రోత్సహించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. పాఠశాలల ఆవరణలో ఆహార భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిబంధనలు పూర్తిగా అమల్లోకి వస్తే, విద్యార్థులలో జంక్ ఫుడ్ తిరిగే అలవాటు తగ్గి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బలమైన పునాది పడుతుందని విద్యావేత్తలు, వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *