Headlines

Smartphone Deals: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌.. ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!


Smartphone Deals: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) స్మార్ట్‌ఫోన్ ముందస్తు ఆఫర్లు ప్రారంభం కానున్నాయి. అసలు సేల్ మాత్రం అక్టోబర్ 8 నుంచి షురూ కానుంది. అయితే ముందస్తు ఆఫర్లతో పాటు కూపన్లు ఇప్పటికే లైవ్‌లోకి వచ్చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్డ్స్‌పై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, కూపన్లను కలిపి ఉపయోగిస్తే ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే కొనేముందు మీ కార్ట్ వద్ద డిస్కౌంట్ లిమిట్, అర్హతలను ఒక్కసారి చెక్ చేసుకోండి.

ఇటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ప్లస్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ లభిస్తుండగా, అందరికీ అక్టోబర్ 9 నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. సేల్ ప్రారంభానికి ముందే అర్థరాత్రి వేళ భారీ ఆఫర్లు, ‘కర్టెన్ రైజర్’ ఫోన్ డీల్స్ విడుదలయ్యే అవకాశముంది. అందుకే ఇప్పటి నుంచే మీకు కావాల్సిన ఫోన్‌ను విష్‌లిస్ట్ చేసుకుంటే, సేల్ టైమ్‌లో వెంటనే కార్ట్‌లోకి వెళ్లి బ్యాంక్ ఆఫర్లు, ట్రాన్సాక్షన్ పరిమితులను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Bank Strike: బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట.. ATM ఛార్జీలు రద్దు..!

ఇవి కూడా చదవండి



SBI కార్డ్‌పై 10% డిస్కౌంట్ వివరాలివే

అమెజాన్ ఫెస్టివల్ పేజీ ప్రకారం సేల్ అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో పాటు క్రెడిట్ కార్డ్ ఇఎమ్‌ఐ (EMI) లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే కార్పొరేట్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ, పేటీఎం ఎస్‌బీఐ, క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్స్‌పై ఈ డిస్కౌంట్ వర్తించదు. ఆఫర్ రకాన్ని బట్టి గరిష్ట డిస్కౌంట్ పరిమితి మారుతుంది. అందుకే పేమెంట్ చేసేముందు కార్ట్‌లో లభించే అసలు డిస్కౌంట్‌ను నిర్ధారించుకోండి. అలాగే, మీ కార్డ్‌లో ఆన్‌లైన్, ఈఎంఐ లావాదేవీల ఆప్షన్లు యాక్టివ్‌గా ఉన్నాయో లేదో ముందే చెక్ చేసుకోండి.

యాక్సిస్, ఐసీఐసీఐ 10% ఆఫర్‌ను ఎలా దక్కించుకోవాలి?

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ బ్యానర్ ద్వారా స్పష్టమైంది. ఫోన్ కొనేటప్పుడు అత్యధిక తగ్గింపు పొందాలంటే.. ముందుగా ప్రొడక్ట్ కూపన్లను అప్లై చేయాలి. ఆ తర్వాత సూపర్ కాయిన్స్ వాడాలి. పాత ఫోన్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పోను మిగిలిన మొత్తానికి బ్యాంక్ డిస్కౌంట్ వర్తిస్తుందో లేదో చూడాలి. కో-బ్రాండెడ్ కార్డ్స్ లేదా యుపిఐ (UPI) పేమెంట్లపై ఈ పార్ట్‌నర్ బ్యాంక్ ఆఫర్లు వర్తించకపోవచ్చు. అందుకే కార్ట్‌లో కనిపించే అప్లయ్డ్ డిస్కౌంట్ వివరాలు, ట్రాన్సాక్షన్ పరిమితులనే చివరిగా ప్రామాణికంగా తీసుకోండి.

ఇది కూడా చదవండి: Banks Strike: బ్యాంక్ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్‌..!

ఉదాహరణకు.. నాన్-ఈఎమ్‌ఐ (Non‑EMI)- మొబైల్‌ అసలు ధర రూ.79,999 ఉంటే అందులో కూపన్‌ డిస్కౌంట్‌ రూ.4,000 అలాగే ఎక్స్చేంజ్‌ ధర రూ.15,000, ఇక బ్యాంకు డిస్కౌంట్‌ రూ.6,100 పోను రూ.54,899కే లభిస్తుంది. ఇలా వీటన్నింటిని లెక్కలేస్తే భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఇక నో కాస్ట్‌ ఈఎంఐలో మొబైల్‌ అసలు ధర రూ.79,999 ఉంటే అందులో కూపన్‌ డిస్కౌంట్‌ రూ.4,000 అలాగే ఎక్స్చేంజ్‌ ధర రూ.15,000, ఇక బ్యాంకు డిస్కౌంట్‌ రూ.6,100, అలాగే ఈఎంఐ ఛార్జ్‌ రూ.1200 ఉండగా, రూ.56,099 అవుతుంది.

ఇది కూడా చదవండి: AC Remote Buttons: ఏసీ రిమోట్‌లో ఈ బటన్స్ ఎందుకు? అసలు ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *