Headlines

సాలె పురుగు కుట్టిన తర్వాత ఏం చేయాలి..? ఈ లక్షణాలు చాలా డేంజర్.. WHO వైద్యుడు ఏం చెప్పారంటే

సాలె పురుగు కుట్టిన తర్వాత ఏం చేయాలి..? ఈ లక్షణాలు చాలా డేంజర్.. WHO వైద్యుడు ఏం చెప్పారంటే


వానాకాలంలో ఇళ్లలోకి రకరకాల పురుగులు, సాలీళ్ళు (Spiders) రావడం మరింత పెరుగుతుంది. అయితే.. ఇలాంటి సందర్భాల్లో సాలె పురుగు కాట్లు పెరుగుతుంటాయి.. సాలీడు కాటు వల్ల నొప్పి, దురద, చర్మం ఎర్రబడటం లేదా తేలికపాటి వాపు వంటి సమస్యలు రావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే, పొరపాటున సాలీడు కుడితే కంగారు పడాల్సిన పనిలేదంటున్నారు.. దాదాపు అన్ని సాలీడు కాట్లు సాధారణమైనవే. కానీ.. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతాయి.. చాలా మంది సాలీళ్లకు భయపడి, సరైన సమాచారం లేకుండా స్వయంగా చికిత్స చేసుకుంటారు. కానీ అలా చేయడం సరైనది కాదు. ఇదే విషయంపై ప్రసిద్ధ నిపుణుడైన డాక్టర్ జేమ్స్ ఓ’డొనోవన్, తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకుని, సాలీడు కాటు వేస్తే ఏమి చేయాలి..? ఏమి చేయకూడదో అనే దానిపై వివరణాత్మక సమాచారాన్ని అందించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టెక్నికల్ అడ్వైజర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ జేమ్స్ ఓ డోనోవన్ ఇచ్చిన చిట్కాలు:

సాలీడు కాటు గాటు ఎలా కనిపిస్తుంది?

చిన్న మచ్చలు, దద్దుర్లు, ఎర్రబడటం, వాపు, దురద

సాలీడు కుడితే ఏం చేయాలి? (డాక్టర్ సలహాలు):

సబ్బుతో శుభ్రం చేయాలి: సాలీడు కుట్టిన వెంటనే ఆ ప్రాంతాన్ని చల్లని నీరు మరియు సబ్బుతో శుభ్రంగా కడగాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని సాలీడు కాటు వేస్తే, ముందుగా ఆ ప్రాంతాన్ని శుభ్రమైన నీటితో, తేలికపాటి సబ్బుతో కడగండి. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించి, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

ఐస్ ప్యాక్ (Ice Pack): సాలీడు కాటు వేసిన చోట మీకు నొప్పి, వాపు లేదా మంటగా అనిపిస్తే, ఐస్‌ను ఒక శుభ్రమైన గుడ్డలో చుట్టి 10 నుండి 15 నిమిషాల పాటు మెల్లగా రుద్దండి. ఐస్‌ను నేరుగా చర్మానికి పెట్టవద్దని గుర్తుంచుకోండి, ఎందుకంటే అలా చేయడం వల్ల చర్మానికి హాని కలగవచ్చు.

గోకకూడదు: సాలీడు కాటు తర్వాత దురద రావడం సాధారణమే, కానీ పదేపదే గోకడం వల్ల చర్మం పొరలుగా ఊడిపోయి, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీలైతే ఆ ప్రదేశాన్ని తాకకుండా ఉండండి.

చేయి/కాలు పైకి ఉంచాలి: చేతులు లేదా కాళ్ళపై కుడితే ఆ భాగాన్ని కొద్దిగా పైకి లేపి ఉంచడం వల్ల వాపు తగ్గుతుంది.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

సాధారణంగా సాలీడు కుట్టిన మచ్చ వారం రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వైద్యులను సంప్రదించాలి..

సాలీడు కాటు తర్వాత మీకు ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, వెంటనే ఆసుపత్రికి వెళ్లండి:

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ముఖం, పెదవులు లేదా గొంతు వాపు

అధిక జ్వరం లేదా చలి

శరీరం అంతటా దద్దుర్లు లేదా అలెర్జీ

కాటు వేసిన చోట తీవ్రమైన నొప్పి లేదా చీమువాంతులు, తల తిరగడం, లేదా స్పృహ కోల్పోయినట్లు అనిపించడం.

కుట్టిన చోట చర్మం నల్లగా మారినా లేదా బొబ్బలు వచ్చినా.. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *