Headlines

కాంగ్రెస్ ధర్నా భగ్నం.. పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ధర్నా భగ్నం.. పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ


నీట్ పేపర్ లీక్ అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ ఆరోపిస్తూ, మంగళవారం కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ధర్నాకు దిగారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు పలువురు నేతలు నిరసనలో పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా తమ ఐదు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే నిరసన విరమిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తదుపరి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసన ప్రాంతానికి చేరుకుని ధర్నాను విరమింపజేసే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కూడా అక్కడి నుంచి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *