Headlines

సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!


నిర్మల్ జిల్లా కేంద్రంలో జూలై 14వ తేదీన చోటుచేసుకున్న ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం, ఆపై పెళ్లి విషయంలో వచ్చిన విభేదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అస్లాం ఖాన్‌కు తన సవతి తల్లి అన్వరి బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ సంబంధాన్ని కొనసాగించకుండా, మరో మహిళను వివాహం చేసుకోవాలని అస్లాం నిర్ణయించుకున్నాడు. ఈ విషయం అన్వరి బేగంను ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొన్నారు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన అస్లాంను హత్య చేయాలని అన్వరి బేగం కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం పరిచయస్తుడైన ముఖీమ్‌తో రూ.6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, ముందుగా రూ.50 వేల అడ్వాన్స్ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు.

ముఖీమ్ తన నలుగురు స్నేహితులతో కలిసి అస్లాం హత్యకు పథకం రూపొందించినట్లు పోలీసులు చెప్పారు. జూలై 1న చేసిన ప్రయత్నం విఫలమవగా, మరోసారి జూలై 14న పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఉదయం సమయంలో కత్తులతో అస్లాంపై దాడి చేసి హత్య అనంతరం నిందితులు మహారాష్ట్ర వైపు పారిపోయినట్లు వెల్లడించారు.

కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. వారి వద్ద నుంచి రెండు కత్తులు, ఒక ద్విచక్ర వాహనం, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. క్లిష్టమైన ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *