దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ డబ్బింగ్ చిత్రం ఐయామ్ గేమ్ ఇటీవలే విడుదలయ్యింది. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గేమ్ డాన్ జాన్ పాత్రలో కనిపించారు. జాన్ జీవితాన్ని జూదం, బెట్టింగ్‌లతో ముడిపడి ఉన్నట్లు భావిస్తుంటాడు, లక్ కాదని, ప్యూర్ అల్గారిథమ్ అని నమ్ముతాడు. అనూహ్యంగా తన తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు, ఓ ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందనేది కథాంశం. చిత్రం ప్రథమార్థం చాలా బాగుంది. డైరెక్టర్ నహాస్ హిదాయత్ యాక్షన్ సీన్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌ను కొత్త కోణంలో డార్క్‌గా చూపించడం ఆకట్టుకుంటుంది. హీరో ఎలివేషన్స్ సైలెంట్‌గా వర్కౌట్ అయ్యాయి. అయితే, ద్వితీయార్థం ప్రారంభం కాగానే సినిమా గ్రాఫ్ పడిపోతుంది. విక్కీ పాత్ర చుట్టూ తిరిగే ఫ్లాష్‌బ్యాక్ సాగదీసినట్టుగా, రొటీన్‌గా అనిపిస్తుంది. పాతకాలపు పగ, ప్రతీకార ఫార్మాట్లోనే యాక్షన్ సీన్లు కొనసాగుతాయి. బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలపై ఇచ్చిన సందేశం బలవంతంగా ఇరికించినట్లుగా భావిస్తారు. దుల్కర్ సల్మాన్ తన నటనతో పాత్రకు ప్రాణం పోశారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, ఖదీర్, కాయదు లోహర్ తమ పరిధి మేరకు నటించారు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం, జిమ్షి ఖలీద్ కెమెరా పనితనం మెప్పించాయి.
మరిన్ని వీడియోల కోసం :
బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు
హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు
క్రేజీగా కమల్ లైనప్… షూటింగ్ స్టేటసేంటి?
టాలీవుడ్లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ రచ్చ
థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?