శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇప్పటికే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. యువ ఆల్‌రౌండర్ సరన్ష్ జైన్‌కు తొలిసారిగా టెస్ట్ జట్టులో చోటు కల్పించారు. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి కీలక ఆటగాళ్లు కొనసాగుతున్నారు. అదనపు బ్యాటింగ్, బౌలింగ్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్‌లను కూడా ఎంపిక చేశారు. వికెట్‌కీపర్ బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించింది.
🚨 News 🚨#TeamIndia‘s squad for the 2⃣-match Test Series against Sri Lanka announced
Note: Washington Sundar was not available for selection for the first Test.
More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj
— BCCI (@BCCI) July 28, 2026
అయితే జట్టులోని కొందరు స్టార్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ సిరీస్‌లో ఆడాలంటే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో తొలి టెస్టుకు ఎంపిక కాలేదు. శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టు ఆగస్టు 7 నుంచి కొలంబోలో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో నిర్వహించనున్నారు.
భారత్ టెస్ట్ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్*, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి