Headlines

 శ్రీనివాస మంగాపురం’ రివ్యూ.. ఘట్టమనేని వారసుడు హిట్ కొట్టాడా లేదా..?

 శ్రీనివాస మంగాపురం’ రివ్యూ.. ఘట్టమనేని వారసుడు హిట్ కొట్టాడా లేదా..?


 శ్రీనివాస మంగాపురం’ రివ్యూ.. ఘట్టమనేని వారసుడు హిట్ కొట్టాడా లేదా..?

మూవీ రివ్యూ: శ్రీనివాస మంగాపురం

నటీనటులు: జై కృష్ణ, రషా తడానీ, మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, కిక్ శ్యామ్, అజయ్, వాసుకి తదితరులు

సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్

ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుల్లపాటి

సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి

నిర్మాత: పి కిరణ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అజయ్ భూపతి

కథ:

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వస్తాడు శ్రీను (జై కృష్ణ). వచ్చీ రాగానే అక్కడ స్థానికంగా అందరినీ భయపెట్టే పేరుమోసిన రౌడీ షీటర్ పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) పేరు వింటాడు. ఆ తర్వాత అనుకోకుండా పెద్దిరెడ్డి గారాల కూతురు మంగా (రషా తడాని)ని చూసి చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు శ్రీను. ఆమె నాటకాల్లో నటిస్తూ డైలాగులు చెప్పలేక ఇబ్బంది పడుతుంటే అతనే దగ్గరుండి సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో తన ప్రేమను చెప్పాలనుకుంటున్న సమయంలోనే.. తనకు ఎంగేజ్‌మెంట్ అంటూ శ్రీనుకు కార్డ్ ఇస్తుంది మంగా. అయినా కూడా తన పుట్టినరోజు నాడే కొండపైకి తీసుకెళ్లి ప్రేమను వ్యక్తపరిచిన శ్రీనును దూరం పెడుతుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో పెద్దిరెడ్డి తమ్ముడి ప్రాణాలను శ్రీను రక్షిస్తాడు. ఆ మరుసటి రోజే పెద్దిరెడ్డి సోదరి వరలక్ష్మి (వాసుకి) తిరుపతికి వచ్చి మంగాను వదిలేయమని గట్టిగా వార్నింగ్ ఇస్తూ, శ్రీనును వాసు బాబు అని పిలుస్తుంది. అక్కడ్నుంచి అసలు కథ మలుపు తిరుగుతుంది. అసలు శ్రీను కాస్తా వాసు బాబు ఎలా అయ్యాడు..? తిరుపతికి, బళ్లారిలో ఉండే వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)కు వాసు బాబుతో ఏంటి సంబంధం అనేది తెరపైనే చూడాలి.

కథనం:

కొత్త హీరోను పరిచయం చేస్తున్నపుడు చాలా వరకు దర్శకులు లవ్ స్టోరీస్ వైపే అడుగులేస్తుంటారు.. కాస్త రొటీన్ అనిపించినా కూడా ఫార్ములాతో సాగే టెంప్లేట్ యాక్షన్ ప్రేమకథ చెప్పాలనుకుంటారు. అజయ్ భూపతి కూడా ఇదే చేసాు. కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడీయన. సాధారణంగా పెద్ద కుటుంబాల నుంచి వచ్చే వారసులు మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంచుకునే రొటీన్ బాటలోనే ఈ సినిమా సాగుతుంది. ప్రథమార్థం అంతా ప్రేమకథలా అనిపిస్తుంది. విలన్ క్రూరత్వాన్ని ఎలివేట్ చేయడం, ఆ తర్వాత హీరోయిన్ వెనకాల హీరో పడటం లాంటివి జరుగుతుంటాయి. మధ్య మధ్యలో పాటలు వస్తుంటాయి. అందులో డాన్సులు చేస్తూ బాగానే అలరించాడు జై కృష్ణ. మధ్యలో నరేష్, బ్రహ్మాజీ పాత్రలు తమదైన శైలిలో కాస్త నవ్వించి ప్రేక్షకులకు రిలాక్సేషన్ ఇస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో హీరో హీరోయిన్ల అసలు పరిచయం, ఆ వెంటనే వచ్చే యాక్షన్ ఘట్టాలు కాస్త ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లోని డ్రామా కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. దర్శకుడు అజయ్ భూపతి గతంలో తాను తీసిన సినిమాల్లాగా ఇందులో ఎలాంటి కొత్తదనం చూపించలేకపోయాడు. పూర్తిగా సేఫ్ గేమ్‌ ఆడేసాడు.. పెద్దగా రిస్కులు తీసుకోకుండా ఫక్తు కమర్షియల్ బొమ్మను ప్రేక్షకుడి మీదకు వదిలాడు. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడుంటే కచ్చితంగా శ్రీనివాస మంగాపురం ఇంకాస్త బెటర్ యాక్షన్ లవ్ స్టోరీ అయ్యుండేది. ఫ్యామిలీ సెంటిమెంట్, కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ వాటిని మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది. అలాగే కీలకమైన పాత్రలను కూడా ఇంకాస్త బలంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా చూస్తే కొత్త హీరో గ్రాండ్ లాంచ్ కోసం తీసిన మాస్ సినిమా ఇది.

నటీనటులు:

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా వచ్చిన జై కృష్ణ తొలి ప్రయత్నంలోనే తన వంతుగా చాలా కష్టపడ్డాడు. యాక్షన్ సీన్స్, డాన్సుల్లో చాలా యాక్టివ్‌గా కనిపించి ఫర్వాలేదనిపించాడు. బాడీ లాంగ్వేజ్‌లో కాస్త తన బాబాయ్ మహేష్ బాబు ఛాయలు కనిపిస్తాయి. అయితే నటన, హావభావాల విషయంలో అతను ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా తన పరిధి మేర నటించింది, కానీ ఆమెకు కూడా ఇంకా నటనలో అనుభవం అవసరం. బళ్లారి పెద్దగా మోహన్ బాబు కనిపించేది కాసేపే అయినా, స్క్రీన్ మీద తన మార్క్ చూపించి డామినేట్ చేశారు. నరేష్, బ్రహ్మాజీ తమ కామెడీ టైమింగ్ తో బాగా అలరించారు. వాసుకి, అజయ్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం పర్లేదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ చాలా కలర్ ఫుల్‌గా ఉంది.. తిరుపతిలోని రియల్ లొకేషన్లను బాగా చూపించారు. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.. కొన్ని సన్నివేశాలకు అక్కడక్కడా కత్తెర వేస్తే బాగుండేది. కానీ దర్శకుడి నిర్ణయం కాబట్టి అతన్ని తప్పుబట్టలేం. వైజయంతి నెట్‌వర్క్, చందమామ కథలు పిక్చర్స్‌ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు వెనకుండి ఖర్చుకు వెనకాడకుండా తీసారు. దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ఇంకాస్త ఫోకస్ చేసుంటే మంచి యాక్షన్ లవ్ స్టోరీ అయ్యుండేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా శ్రీనివాస మంగాపురం.. జై కృష్ణ బాగున్నాడు.. యాక్షన్ లవ్ స్టోరీ..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *