Headlines

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు కీలక కామెంట్స్..


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తిరిగి రాజకీయాల్లో పూర్తిస్థాయిలో క్రియాశీలకమయ్యారు. ఎన్నికల అనంతరం దాదాపు రెండేళ్ల పాటు రాజకీయ విరామం తీసుకున్న ఆయన.. తాజాగా టీవీ9 క్రాస్‌ఫైర్ ఇంటర్వ్యూలో తన రాజకీయ విరామానికి గల కారణాలు, వైసీపీ ఓటమికి దారితీసిన అంశాలు, జగన్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంపై ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్నికల తర్వాత రెండేళ్లపాటు ఉద్దేశపూర్వకంగానే రాజకీయాలకు దూరంగా ఉన్నానని ధర్మాన స్పష్టం చేశారు. ‘‘అధికారం కోల్పోయినప్పుడు ప్రజలకు ఒక అవకాశం ఇవ్వాలి. తాము ఓడించిన పార్టీ స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వ పనితీరును, వారి నిర్ణయాలను ప్రజలే స్వయంగా బేరీజు వేసుకోవడానికి సమయం అవసరం. ఇది నాకు కాంగ్రెస్ పార్టీ హయాం నుంచే ఉన్న అలవాటు’’ అని తెలిపారు. ఆ సమయం ఇప్పుడు పూర్తయిందని, ఇకపై పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లోనే ఉంటానని వెల్లడించారు.

ఓటమికి కారణం సంస్కరణల ఆలస్యమే

వైసీపీ ఓటమిని విశ్లేషిస్తూ.. తాము తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు వెంటనే కనిపించేవి కావని, ప్రజలకు అవి పూర్తిగా అర్థం కావడానికి కొంత సమయం పడుతుందని ధర్మాన అన్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, పేదల ఉన్నత విద్యకు అందించిన ప్రోత్సాహం వంటి పథకాలు రాష్ట్రాభివృద్ధికి దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుస్తాయని, అయితే ఎన్నికల సమయానికి ఆ ఫలితాలు ప్రజల్లోకి పూర్తిస్థాయిలో చేరలేకపోయాయని విశ్లేషించారు. వైసీపీని అవినీతి, అరాచక పార్టీగా చిత్రీకరిస్తూ టీడీపీ చేసిన విమర్శలను ధర్మాన తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు ముందు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారమే ఇదని కొట్టిపారేశారు. ప్రజలు తాత్కాలికంగా ఆ మాటలను నమ్మినా, దీర్ఘకాలంలో నిజాలేంటో గ్రహిస్తారనే నమ్మకం తనకుందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *