Headlines

Bank Strike: బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు బ్యాంకులు అలర్ట్.. ముందే ఇలా ప్లాన్ చేస్కోండి..


దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు మరోసారి తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకు యూనియన్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి ఐదు రోజుల పని దినాలు, ఇతర పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు సంఘాలు కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక శాఖ సూచన మేరకు డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌తో జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదు. ఐదు రోజుల పని విధానం అంశం పరిశీలనలో ఉందని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ.. స్పష్టమైన హామీ లభించకపోవడంతో యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె చేపట్టాలని బ్యాంక్ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మెకు ముందు రెండు రోజులు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవులు ఉన్నాయి.  అయితే ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంచాలని ఆర్ధికశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం బ్యాంకులు ఓపెన్ చేసి ఉంటాయి.

అయితే బ్యాంక్ సమ్మె కారణంగా 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకింగ్‌ లావాదేవీలు, నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్‌ వంటి సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో ఖాతాదారులు ముందుగానే తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంకులు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తున్నాయి. అయితే ఇఈ నెల 11న కూడా బ్యాంక్ సంఘాలు సమ్మె నిర్వహించాయి. తమ డిమాండ్ నెరవేర్చకపోతే మళ్లీ ఈ నెలలో సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. దీంతో ఈ నెల చివరివారంలో మళ్లీ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మె చేపడుతున్నాయి.  ఈ పరిణామాల దృష్ట్యా వినియోగదారులు తమ ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ముందుగానే పూర్తిచేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ సమ్మె క్రమంలో ఈ నెల 25వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించనుంది.

అటు ఏపీలో పించన్లు ప్రతీ నెలా ఒకటో తేదీ ఉదయం అందించేవారు. బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి అందించాలని నిర్ణయం తీసుకుంది. ఒకటో తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు జమ అవుతాయి. ఈ నెల 30వ తేదీ వరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె కారణంగా బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది. దీని వల్ల ఒకటో తేదీన బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముంది. దీంతో తమ జీతాలు ఒకటో తేదీన జమ అవుతాయా.. లేదా అనే టెన్షన్ ఉద్యోగులకు పట్టుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *