విమానం ల్యాండ్‌ అవ్వగానే..ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసి..

విమానం ల్యాండ్‌ అవ్వగానే..ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసి..


చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ అరేబియా విమానం ల్యాండ్ కాగానే, ట్యాక్సీవేపై కదులుతుండగా ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచి బయటకు దూకాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.పుదుక్కోటకు చెందిన సదరు ప్రయాణికుడిని వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ప్రయాణికుడు తీవ్రమైన వాంతులతో అస్వస్థతకు గురయ్యాడని, ఆ కంగారులోనే ఇలా చేశాడని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పోలీసులకు అప్పగించారు. విమానం నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, విమానానికి కూడా నష్టం కలగలేదని విమానాశ్రయ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఘటన కారణంగా ప్రధాన రన్‌వేను గంటపాటు మూసివేసి విమానాలను దారి మళ్లించారు.

మరిన్ని వీడియోల కోసం :

పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా.. ఈసారి బాక్సులు బద్ధలే..!

టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్‌లో కొత్త గొడవలు..!

సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *