పదవీ విరమణ తర్వాత హాయిగా, ఏ ఆర్థిక బాధలూ లేకుండా, ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఉద్యోగులంతా కోరుకుంటారు. ఇందుకోసం అన్నేళ్లూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని పలు పథకాల్లో పొదుపు చేస్తారు. అయితే ఇందుకోసం సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. భవిష్యత్తు అవసరాలను, పదవీ విరమణ జీవితాన్ని సురక్షితం చేసుకునేందుకు సరైన పొదుపు మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే వీటిలో ఏది ఎవరికి ఉత్తమమో తెలుసుకోవడం అవసరం. ఈపీఎఫ్ (EPF) అనేది 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో పనిచేసే వారికి తప్పనిసరి పొదుపు పథకం. ఇందులో ఉద్యోగి ప్రాథమిక జీతం, డీఏలో 12 శాతం జమ కాగా, యజమాని కూడా అంతే మొత్తం చెల్లిస్తారు. ఉద్యోగులు తమ వైపు నుంచి 12 శాతం కంటే ఎక్కువ పొదుపు చేయాలనుకుంటే విపిఎఫ్ (VPF)ను ఎంచుకోవచ్చు. VPF నిబంధనల ప్రకారం, మీరు మీ ప్రాథమిక జీతంలో 100 శాతం కూడా VPFలో జమ చేయవచ్చు. దీనివల్ల పదవీ విరమణ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. VPF మీద సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని వస్తుంది. పైగా ఇది రిస్క్-ఫ్రీ, దీనిలో డబ్బు కోల్పోయే ప్రమాదం లేదు. దీనికి కూడా EPFతో సమానమైన ఆకర్షణీయ వడ్డీ లభిస్తుంది. అయితే ఇవి కేవలం జీతభత్యాలు పొందే ఉద్యోగులకే పరిమితం. మరోవైపు పీపీఎఫ్ కూడా ఉద్యోగులతో పాటు స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, వ్యాపారులు, సాధారణ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి దీని వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి తన 30 ఏళ్ల వయస్సులో పీపీఎఫ్ పథకంలో చేరి, ప్రతి సంవత్సరం రూ. 1.5 లక్షల చొప్పున జమ చేయడం ప్రారంభిస్తే, అతను 60 ఏళ్ల వయస్సుకు చేరుకునే సరికి ఏకంగా రూ. 1.54 కోట్ల భారీ నిధిని సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించే ఈ పొదుపు పథకం, పెట్టుబడిదారుల సొమ్ముకు పూర్తి భద్రతను కల్పించడమే కాకుండా, మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరమైన మరియు ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తుంది. జీతం పొందే ఉద్యోగులకు EPF, VPFలు వేగంగా పెద్ద నిధిని నిర్మించడానికి సహాయపడుతుండగా, సామాన్యులకూ మెరుగైన ఆదాయాన్ని సమకూర్చే పథకంగా పీపీఎఫ్ నిలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!
Vande Bharat: దసరా నాటికి ‘వందేభారత్ స్లీపర్’ రైళ్లు.. విజయవాడ డివిజన్లో పట్టాలెక్కనున్న ట్రైన్
బ్రాండ్ Vs జనరిక్ ఫార్ములా ఒకటే.. ధరల్లో భారీ తేడా.. ఎందుకిలా?
Viral Video: బాస్ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
Chennai Love Story: హిట్టా..? ఫట్టా..? కిరణ్ అబ్బవరం ఖాతాలో హిట్ పడిందా?