Headlines

రాష్ట్రపతితో కలిసి సినిమా చూసిన ఏకైక తెలుగు హీరో ఈయనే..

రాష్ట్రపతితో కలిసి సినిమా చూసిన ఏకైక తెలుగు హీరో ఈయనే..


నటుడు సుమన్ గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, అలాగే అన్నమయ్య సినిమాతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జీవితంలోని సవాళ్లను ఎదుర్కొన్న విధానం, కర్మ సిద్ధాంతంపై తనకున్న దృఢ విశ్వాసం,అలాగే అన్నమయ్య లో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించడం ద్వారా పొందిన అనుభూతిని ఆయన పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. జైలు నుంచి బయటపడినప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మార్షల్ ఆర్ట్స్ తనకు ఎంతగానో సహాయపడిందని సుమన్ తెలిపారు. “జైలుకి వెళ్లి బయటికి వచ్చిన వాళ్ల రూపాలు మారిపోతాయి, డిప్రెషన్ లో రూపాలు మారిపోతాయి. కానీ మార్షల్ ఆర్ట్స్, మెడిటేషన్, నా బిలీఫ్, కర్మ సిద్ధాంతం బిలీఫ్ నన్ను కాపాడాయి” అని ఆయన అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

తన సినీ జీవితంలో అన్నమయ్య చిత్రం ఒక మైలురాయి అని సుమన్ అన్నారు. వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించడానికే దేవుడు తనను సినిమా పరిశ్రమకు తీసుకువచ్చాడని నమ్ముతా అని సుమన్ అన్నారు. ఈ పాత్ర కోసం తాను పడిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఎన్.టి.ఆర్. గారిని ఆదర్శంగా తీసుకుని, పాత్రకు తగ్గట్టుగా కఠినమైన నియమాలు పాటించా అన్నారు. “రామారావు గారిలో ఒక 10 శాతం మనం చేయగలిగితే చాలు” అని భావించి, ఆయన నేల మీద పడుకునేవారు, ఉదయం 3 గంటలకు లేచేవారు, వ్యాయామం చేసేవారు అనే విషయాలు తెలుసుకుని, సుమన్ కూడా అదే విధంగా ఎనిమిది నెలల పాటు నేలపై నిద్రపోయారు, ఉదయం 3 గంటలకు నిద్రలేచారు, పూర్తిగా శాఖాహారం తీసుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు ఇల్లు-షూటింగ్, షూటింగ్-ఇల్లు మాత్రమే తన ప్రపంచమని, కుటుంబ జీవితానికి దూరంగా ఉన్నానని చెప్పారు.

ఇది కూడా చదవండి : 21 సినిమాలు చేస్తే.. మూడు మాత్రమే హిట్..! కట్ చేస్తే విలన్‌గానూ అదరగొట్టాడు

దర్శకుడు కె. రాఘవేంద్ర రావు సెట్స్‌లో తనను “స్వామి” అని పిలిచేవారని, తన పేరు పెట్టి ఎప్పుడూ పిలవలేదని సుమన్ సంతోషంగా తెలిపారు. ఈ పాత్రకు మేకప్, ఆభరణాలు, అలాగే సాంకేతిక మెరుగులు ఎంతగానో దోహదపడ్డాయని, అందుకు నిర్మాతలు స్వర్గీయ దొరస్వామి రాజు గారు, కెమెరామెన్ విన్సెంట్, సంగీత దర్శకుడు కీరవాణి,  గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు తెలిపారు. “నేను ఒట్టి విగ్రహమే. ఆ విగ్రహానికి రంగు పూసి, అంత తీర్చిదిద్దింది టెక్నీషియన్స్” అని సుమన్ అన్నారు. అన్నమయ్య చిత్రం ఒక భక్తిరస ప్రధానమైన సినిమా కావడం వల్ల, అప్పట్లో రొమాంటిక్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో దీనిని నిర్మించడం ఒక సాహసమని సుమన్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, దొరస్వామి రాజు గారి భక్తి, కె. రాఘవేంద్ర రావు గారి నిష్ఠతో ఈ సినిమా విజయవంతమైంది. “ఈరోజు కూడా సినిమా టీవీలో చూస్తే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది, ఒక అనుభూతి” అని సుమన్ అన్నారు. అలాగే అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మతో కలిసి పక్కనే కూర్చొని అన్నమయ్య సినిమా చూశా అని సుమన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి : Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *