రణబీర్ కపూర్, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం తాజాగా నార్త్ అమెరికాలో సరికొత్త చరిత్రను లిఖించింది, ఇండియన్ సినిమా రంగంలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. గత ఎనిమిది నెలలుగా అగ్రస్థానంలో ఉన్న ధరంధర్ 2 సినిమా రికార్డును బద్దలుకొట్టి, నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రామాయణ నిలిచింది. ఏకంగా 28.6 మిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించి, నార్త్ అమెరికా మార్కెట్లో బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగా తన సత్తాను చాటింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన రామాయణ ఖాతాలో ఇది మరో కీలకమైన మైలురాయి. మూడో వీకెండ్లోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ, ముఖ్యంగా ఓవర్సీస్ నుండి బలమైన వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా విజయంలో నార్త్ అమెరికా మార్కెట్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే 1760 కోట్ల గ్రాస్ మార్క్‌ను సునాయాసంగా దాటేసిన రామాయణ, ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ జాబితాలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ధురంధర్ బ్యూటీకి ఇన్నాళ్లకు మంచి ఆఫర్ వచ్చిందా..?
కాఫీ విత్ కరణ్ షోలో షాకింగ్ విషయాలు చెప్పిన అక్షయ్