Headlines

నవమాసాలు మోసిన తల్లే… ముగ్గురు బిడ్డలను సంపులో పడేసింది.. చివరకు!


కుటుంబ కలహాలు.. క్షణికావేశం.. కారణం ఏదైనా అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నవమాసాలు మోసి కనిపెంచాల్సిన తల్లే.. కన్నబిడ్డల పాలిట కాలయముడిగా మారిందన్న వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు ఎనిమిది నెలల పసికందులు, రెండేళ్ల చిన్నారి విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అసలేం జరిగింది?

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య, శ్రీవర్ష దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె ప్రియాంక వయసు రెండేళ్లు కాగా, మరో ఇద్దరు కవల పిల్లలు ప్రిన్సి, ప్రీతి వయసు కేవలం ఎనిమిది నెలలు.

చెన్నయ్య ఎలక్ట్రీషియన్‌గా, కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, కుటుంబంలో చోటుచేసుకున్న గొడవల నేపథ్యంలో శ్రీవర్ష తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

నీటి సంపులోకి ముగ్గురు చిన్నారులు..!

ఇంట్లో ఎవరూ ఊహించని విధంగా శ్రీవర్ష తన ముగ్గురు పిల్లలను ఒకరి తర్వాత మరొకరిని నీటి సంపులో పడేసినట్లు తెలుస్తోంది. అనంతరం తాను కూడా సంపులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తల్లిని బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన శ్రీవర్షను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విచారణలో వెలుగులోకి అసలు కారణాలు..!

ముగ్గురు చిన్నారుల మరణవార్తతో తండ్రి చెన్నయ్య కన్నీరుమున్నీరవుతున్నాడు. అసలు దంపతుల మధ్య గొడవకు కారణమేంటి? శ్రీవర్ష ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయి. కానీ ఏ తప్పూ చేయని పసిపిల్లల ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ముగ్గురు చిన్నారుల మరణంతో తొమ్మిదిరేకుల గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *