Headlines

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు లేవు…2,000 వరకు ఉచితం


ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కొత్త నిబంధనలను విడుదల చేసింది. సెప్టెంబర్ 14, 2026న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, 2,000 వరకు ఉన్న యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు , పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు…ఈ నిబంధన చెల్లింపు చేసేవారికి ,అందుకునేవారికి రెండు వైపులా వర్తిస్తుంది.ఇది 2007 పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10ఏ సవరణ తర్వాత వచ్చిన మొదటి నోటిఫికేషన్. గతంలో అన్ని యూపీఐ లావాదేవీలపై జీరో ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) వర్తించేది. ఇప్పుడు ప్రభుత్వం ఏ ఏలక్ట్రానిక్ పేమెంట్ మోడ్‌లపై ఛార్జీలు ఉండకూడదని నిర్ణయించుకునే అధికారం కలిగి ఉంది. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 2,000 వరకు యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా ఉంటాయి..రూపే డెబిట్ కార్డు చెల్లింపులు మొత్తం ఉచితంగా ఉంటాయి..వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) యూపీఐ బదిలీలు ఉచితంగా కొనసాగుతాయి..2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు లేవు..అయితే భవిష్యత్తులో పెద్ద వ్యాపారుల (మర్చంట్) లావాదేవీలపై నామమాత్రపు ఎండీఆర్ విధించే అవకాశం ఉంది.ఇది వినియోగదారులపై కాకుండా వ్యాపారులపైనే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది..ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో సుమారు 96 శాతం 2,000 లోపు ఉన్నాయి. కాబట్టి అత్యధిక మంది వినియోగదారులకు ఎలాంటి మార్పు ఉండదు.ప్రభుత్వం ఈ చర్యను డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సుస్థిరంగా ఉంచడానికి తీసుకున్న నిర్ణయంగా అభివర్ణిస్తోంది. వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *