Headlines

ఇందిరమ్మ ఇళ్లు దక్కని వారికి లక్కీ ఛాన్స్.. స్థానికుల కోసం మరోసారి లాటరీ!


హైదరాబాద్‌ మహానగరంలోని పలు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 600 మంది చొప్పున 480 మంది ప్రధాన జాబితా, 120 మంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఎంపికయ్యారు. వీరి వివరాలపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో స్థానికుల సంఖ్య ఇళ్ల కేటాయింపునకు సరిపడా లేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ మిగిలిన ఇళ్ల కోసం స్థానికులుగా నిర్ధారణైన దరఖాస్తుదారులతో మరోసారి లాటరీ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కూకట్‌పల్లిలోనూ ఇతర ప్రాంతాల వారు ఎంపికయ్యారన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రస్తుతం ఇళ్ల సంఖ్యకు సరిపడా స్థానికులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. తగిన సంఖ్య లేకపోతే అక్కడ కూడా మరో డ్రా నిర్వహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని ఎంపిక కాని వారికి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారుల తుది జాబితా ఖరారు కాకపోవడంతో రిఫండ్‌ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, దరఖాస్తులో నియోజకవర్గ వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో సవరణకు అవకాశం కల్పించారు. అప్లికేషన్‌, ఫోన్‌ నంబర్‌ లేదా ఆధార్‌ వివరాలతో లాగిన్‌ అయి మార్పులు చేసుకోవచ్చు.

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు ఎంపికైన వారికి సోమవారం నుంచి వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా అలాట్‌మెంట్‌ లెటర్లు పంపనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీజీహెచ్‌బీ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *