యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు


ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కొందరు సినీ,టీవీ సెలబ్రిటీలు మాత్రం.. ఇంటా.. బయటా ఎక్కడా గెలవకపోయినా.. యూట్యూబ్‌లో గెలిస్తే చాలంటున్నారు. ఆదాయానికి ఆదాయం.. పేరుకు పేరుకు.. బోనస్‌గా కష్టమనేదే లేని లైఫు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమ డెయిలీ యాక్టివిటీస్‌తో పాటే.. చాలా విషయాలను.. విశేషాలను.. పిన్ టూ పిన్ వీడియోలుగా మలిచి యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ ను పడుతున్నారు. మధ్యలో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో కలుపుకుని ప్రతి నెలా లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీ వుడ్.. అనే తేడా లేకుండా.. చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు యూట్యూబ్‌ రెవెన్యూ పై దృష్టిపెడుతున్నారు. వారి కున్న కొద్ది పాటి క్రేజ్‌తో.. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్‌గా మారిపోతున్నారు. అయితే యూట్యూబ్‌ వేదికగా ఎవరెవరు ఎక్కువగా సంపాదిస్తున్నారన్నది తెలుసుకునే ముందు… అసలు యూట్యూబ్‌ ఎకనామిక్స్ అంటే ఏంటి? CPM అంటే ఏంటి ? RPM అంటే ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్‌ ద్వారా డబ్బు ఎలా వస్తుంది. ఆ డబ్బు ఎలా పంపిణీ అవుతుంది.. అనేదే యూట్యూబ్ ఎకనామిక్స్‌. యూట్యూబ్ ఎకనామిక్స్‌లో ప్రదానమైనది.. యాడ్ రెవెన్యూ.! వీడియోల మధ్య వచ్చే ప్రకటనల ద్వారా యూట్యూబ్‌ అండ్ క్రియేటర్స్ ఇద్దరూ డబ్బు సంపాదిస్తుంటారు. ఇలా యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుంది కనుక.. దీన్ని యాడ్ రెవెన్యూ అంటారు. రెండోది క్రియేటర్ ఎకానమీ.! వీడియోలు చేసే వ్యక్తులు అంటే క్రియేటర్స్‌… బ్రాండ్‌ ప్రమోషన్లు, ఛానల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్స్ ద్వారా పొందే ఆదాయాన్ని క్రియేటర్ ఎకానమీ అంటారు. మూడోది అల్గారిథమ్‌ ఎఫెక్ట్.. ఏ వీడియో ఎక్కువ మందికి చేరాలి, ఏది ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి అనేది యూట్యూబ్ అల్గారిథమ్ నిర్ణయిస్తుంది. అంటే ఓ వీడియో రీచ్‌ను నిర్ణయించేది ఇదే అని చెప్పవచ్చు. ఇక యూట్యూబ్ మానిటైజేషన్‌లో CPM అంటే Cost Per Mille అని అర్థం. ఇక్కడ ‘Mille’ అంటే లాటిన్ భాషలో ‘వెయ్యి’ అని అర్థం. ఇంకాస్త ఎలాబరేటెడ్‌ గా దీన్ని వివరించాలంటే.. ఎవరైనా చేసిన ఓ వీడియోపై ప్రతీ వెయ్యి యాడ్ ఇంప్రెషన్‌ల కోసం అడ్వటైజర్ కొంత డబ్బును చెల్లిస్తారు. ఈ విలువనే CPM తెలియజేస్తుంది. ఇలా అడ్వటైజర్స్ ఇచ్చే డబ్బును యూట్యూబ్‌ కొంత షేర్ తన దగ్గర ఉంచుకుని.. రిమైనింగ్ షేర్‌ను ఆ వీడియో చేసిన క్రియేటర్‌కు ఇస్తుంది. ఇప్పుడున్న పాలసీ ప్రకారం.. యూట్యూబ్‌ 45శాతం తన దగ్గర ఉంచుకుని.. 55శాతం రెవెన్యూను క్రియేటర్‌కు ఇస్తుంది. ఈ రెవెన్యూ షేర్‌ను లెక్కించడానికి ఓ ఫార్ములా ఉంది. CPM = (Totla ad spend/ Total impressions * 1000. ఫర్ ఎగ్జాంపుల్.. ఒక అడ్వటైజర్ లక్ష సార్లు తన యాడ్‌ను చూపించడానికి పదివేలు ఖర్చు చేస్తే.. అప్పుడు CPM 100రూపాయలు అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ప్రతి క్రియేటర్‌కు లేదా ప్రతి వీడియోకు CPM ఒకేలా ఉండదు. కంటెంట్‌ను బట్టి.. ప్రదేశాన్ని బట్టి.. సీజన్‌ ను బట్టి CPM మారుతుంటుంది. ఫైనాన్స్, టెక్నాలజీ, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై చేసే వీడియోలకు CPM ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రంగాల్లో ప్రకటనదారులు ఎక్కువ పోటీ పడతారు.అమెరికా లేదా యూకే వంటి దేశాల్లో చూస్తే CPM చాలా ఎక్కువగా ఉంటుంది.. అదే ఇండియాలో కాస్త తక్కువగా ఉంటుంది. పండుగలు లేదా సెలవుల సమయంలో కంపెనీలు తమ వస్తువులను ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు చేస్తాయి, కాబట్టి ఆ సమయంలో CPM పెరుగుతుంది. CPM అడ్వటైజర్స్‌ కోసం అయితే.. RPM – Revenue per mile క్రియేటర్ల కోసం. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది క్రియేటర్ల సంపాదన. ప్రతి వెయ్యి వ్యూస్‌కు వచ్చే ఆదాయమే RPM.యాడ్స్ , మెంబర్ షిప్స్, సూపర్ చాట్స్ అన్నీ కలిపి RPMని లెక్కిస్తారు. దీన్ని లెక్కించడానికి కూడా ఓ ప్రిన్సిపుల్ ఉంది. RPM= (total Revenue Earned/Total Views)* 1000. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానెల్‌కు 1,00,000 వ్యూస్ వచ్చి, మీకు మొత్తం 500 రూపాయల ఆదాయం వస్తే, మీ RPM 5 రూపాయలు అవుతుంది. ఈ RPMలో కేవలం ప్రకటనల ద్వారా వచ్చే డబ్బే కాకుండా… వీడియోల్లో వచ్చే యాడ్ రెవెన్యూ.. యూట్యూబ్‌ ప్రీమియం రెవెన్యూ.. ఛానల్ మెంబర్ షిప్స్ రెవెన్యూ, సూపర్ చాట్ & సూపర్ థాంక్స్‌ వచ్చే డబ్బు కూడా ఉంటుంది. భారతదేశంలో 2026 నాటికి ఎంటర్‌ టైన్మెంట్ , వ్లాగ్ వీడియోస్‌కి అయితే.. సగటున 1,000 వ్యూస్‌కి.. 40 నుంచి 80 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఫినాన్షియల్ లేదా ఎడ్యుకేషన్ వీడియోలకు అయితే 100 నుంచి 150 రూపాలయ వరకు ఆదాయం వస్తుంది. ఇక షార్ట్స్‌కు ఐదు నుంచి 30 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కలను వంటబట్టించుకున్నారు కాబట్టే.. ప్రస్తుతం సినిమా తారలు , టీవీ సెలబ్రిటీలు .. యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ.. ఆదాయాన్ని అర్జిస్తున్నారు. అయితే సాధారణ క్రియేటర్ల కంటే చాలా త్వరగా.. ఎక్కువగా వీళ్లు డబ్బు సంపాదించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. సాధారణ వ్యక్తులు సున్నా నుండి సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవాలి. కానీ సెలబ్రిటీలకు ఇప్పటికే ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి, ఛానెల్ పెట్టిన కొన్ని రోజుల్లోనే లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వస్తారు. దీనివల్ల వారికి మానిటైజేషన్ చాలా వేగంగా అవుతుంది.సెలబ్రిటీల వీడియోలకు సాధారణంగా వ్యూస్ ఎక్కువగా వస్తాయి. బ్రాండ్‌లు తమ వస్తువులను ప్రచారం చేయడానికి సాధారణ క్రియేటర్ల కంటే సెలబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. బ్రాండ్ డీల్స్ , హై క్వాలిటీ అడ్వర్టైజర్స్ నుంచి కూడా సెలబ్రిటీలకు భారీగానే ఆదాయం వస్తుంది. సినిమా తారలు.. తమ షూటింగ్ లొకేషన్లు, ఇంటి విశేషాలు, ప్రయాణాలు వంటి Lifestyle Vlogs చేస్తారు. ప్రేక్షకులకు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై ఆసక్తి ఉండటంతో ఈ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తాయి.సినిమాలు లేని టైంలో లేదా.. ఖాళీగా ఉన్నప్పుడు యూబ్యూబ్‌ వారికి ఒక స్థిరమైన ఆదాయ వనరుగా మారుతోంది. వీటికి తోడు క్రాస్ ప్రమోషన్స్‌ ద్వారా కూడా సెలబ్రిటీలు డబ్బు సంపాదిస్తున్నారు. వారు నటించే సినిమాల టీజర్లు, సాంగ్స్ లేదా ఇంటర్వ్యూలను తమ ఛానెల్‌లో పెట్టుకోవడం ద్వారా అటు సినిమాకు ప్రచారం, ఇటు యూట్యూబ్ ద్వారా ఆదాయం.. రెండూ పొందుతున్నారు. సాధారణంగా ఒక సెలబ్రిటీ ఛానెల్‌కు నెలకు కేవలం యాడ్స్ ద్వారానే ₹2 లక్షల నుండి ₹10 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. స్పాన్సర్‌షిప్‌లు కలిపితే ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న సోనాక్షి సిన్హా.. రీసెంట్‌గా తన భర్తతో కలిసి యూట్యూబ్‌లోనే ఎక్కువ కనిపిస్తోంది. సినిమాలు తగ్గడంతో.. ఇప్పుడు యూట్యూబ్‌ మీదే ఫోకస్ చేసింది. లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తూ తెగ సంపాదించేస్తోంది. ఆలియా భట్ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పర్సనల్ వ్లాగ్స్, షూటింగ్ సెట్స్ వెనుక విశేషాలు, ఫిట్‌నెస్ మరియు డైట్ రహస్యాలను పంచుకుంటూ ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ఆలియా భట్ యూట్యూబ్‌ ఛానల్‌కు దాదాపు 2.6 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.ఇక శిల్పా శెట్టి .. యోగా, ఆరోగ్యకరమైన వంటకాలు మరియు ఫిట్‌నెస్ చిట్కాలతో కూడిన కంటెంట్‌ను ఈమె రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తారు. అందులోనూ ఆమె పోస్ట్‌ చేసే ‘యోగా’ వీడియోలకు మంచి ఆదరణ ఉంది. కృతి సనన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్లాగ్స్‌తో పాటు ఫిట్‌నెస్ మంత్ర, మేకప్ చిట్కాలను యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు అయిన ఫరా ఖాన్, ఇటీవల వంటకాలు.. ఇతర సెలబ్రిటీలతో చేసే ఫన్నీ వ్లాగ్స్ ద్వారా యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యారు. మంచి ఇన్‌కమ్‌ను జనరేట్ చేసుకుంటున్నారు. ట్యాలెంటెడ్ నటుడు ఆశిష్ విద్యార్థి తన ‘ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్’ ద్వారా యూట్యూబ్‌లో కొత్త ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ రకాల వంటకాలను పరిచయం చేస్తుంటారు. అర్చన పూరన్ సింగ్.. ‘ది కపిల్ శర్మ షో’ వెనుక జరిగే సరదా సంఘటనలను, తన వ్యక్తిగత వ్లాగ్స్‌ను ఈమె క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వీరితో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి, మరియు మాధురీ దీక్షిత్ వంటి వారు కూడా తమ డ్యాన్స్ మరియు బ్యూటీ కంటెంట్‌తో యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. మరోవైపు, యూట్యూబ్ నుంచి వచ్చి బాలీవుడ్‌లో స్థిరపడుతున్న భువన్ బామ్, హర్ష్ బెనివాల్, మరియు ప్రాజక్త కోహ్లీ వంటి డిజిటల్ స్టార్స్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీ హోదాను అనుభవిస్తూ భారీ స్థాయిలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో కూడా ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు సినిమాలతో పాటు యూట్యూబ్ ద్వారా అభిమానులకు వ్యక్తిగత విశేషాలను పంచుకుంటున్నారు. కేవలం మెయిన్ స్ట్రీమ్ హీరోలు, హీరోయిన్లే కాకుండా సీనియర్ నటులు మరియు సహాయ నటులు కూడా ఇందులో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఇటీవల తన సొంత ఛానెల్‌ను ప్రారంభించారు. ఇందులో తన ఫిట్‌నెస్, తన వ్యక్తిగత లైఫ్ స్టైల్ వ్లాగ్స్‌ను షేర్ చేస్తున్నారు.దాంతో పాటే తన కార్లు, బైకులపై వీడియోలు చేస్తున్నాడు.అల్లు అర్జున్ తన అధికారిక ఛానెల్‌లో తన సినిమాల అప్‌డేట్స్‌తో పాటు, తన విదేశీ పర్యటనలు, ముఖ్యమైన ఈవెంట్స్ వెనుక ఉన్న దృశ్యాలను పోస్ట్ చేస్తుంటారు.సమంత తన హెల్త్ జర్నీ, యోగా, మెడిటేషన్, స్కిన్ కేర్ రొటీన్ గురించి కంటెంట్ చేస్తుంటారు. మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుమారుడితో గడిపే సమయం, ప్రయాణాలు మరియు తన వ్యక్తిగత జీవిత విశేషాలను వ్లాగ్స్ రూపంలో పంచుకుంటున్నారు.జగపతి బాబు తన లైఫ్ ఫిలాసఫీ మరియు తన దైనందిన జీవితంలోని ఆసక్తికర విషయాలను యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. వీరే కాదు రాజీవ్ కనకాల.. ఆయన భార్య యాంకర్ సుమ.. ప్రియమణి, బెల్లంకొండ శ్రీనివాస్‌,నిహారిక కొణిదల వంటి వారు కూడా యూట్యూబ్‌లో కంటెంట్ చేస్తూ.. యూట్యూబ్ నుంచి భారీగా ఆదాయాన్ని అర్జిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్కింటి వారి వల్ల నిద్ర కరువైంది.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ పై ఫిర్యాదు

చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..

ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు

ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?

దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *