మృణాల్ విషయంలోనూ అరవింద్ కామెంట్స్ నిజమవుతాయా?

మృణాల్ విషయంలోనూ అరవింద్ కామెంట్స్ నిజమవుతాయా?


డెకాయిట్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అడవిశేష్ హీరోగా నటించిన డెకాయిట్ విజయోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అరవింద్, కథానాయిక మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నువ్వు ఇక్కడే ఎవరినైనా పెళ్లి చేసుకుని స్థిరపడాలి. నేను ఆశీర్వదిస్తున్నాను. అలా అయితేనే నిన్ను ఇక్కడ కట్టిపడేయగలం. నువ్వు మాకు కావాలి” అని అన్నారు. మృణాల్ టాలీవుడ్‌కు చెందిన వారినే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సరదాగా చేసినవా లేక జరగబోయే దాని గురించి ఏదైనా హింట్ ఇచ్చారా అనే చర్చ మొదలైంది. గతంలో లావణ్య త్రిపాఠి విషయంలోనూ అల్లు అరవింద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్‌!

ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్

షారుఖ్‌ ప్లేస్‌ని రణ్‌వీర్‌ కొట్టేస్తారా?

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *