మీకు ఎంత స్నేహం ఉన్నా సరే, ఆఫీసు కొలీగ్స్‌తో ఈ 10 విషయాలు అస్సలు చెప్పకండి.. చాలా ప్రమాదకరం!

మీకు ఎంత స్నేహం ఉన్నా సరే, ఆఫీసు కొలీగ్స్‌తో ఈ 10 విషయాలు అస్సలు చెప్పకండి.. చాలా ప్రమాదకరం!


ఆఫీసులో సహోద్యోగులతో స్నేహం ఉండటం సహజమే, కానీ కొన్ని విషయాలను పంచుకోవడం వల్ల కెరీర్‌కు ప్రమాదం వాటిల్లవచ్చు. అమెజాన్‌లో పనిచేసే ఒక యువతి సోషల్ మీడియాలో పంచుకున్న సలహాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీ జీతం, వ్యక్తిగత సమస్యలు, ఆఫీసు రాజకీయాలు లేదా ఇతర సహోద్యోగులపై ఫిర్యాదులు వంటి 10 విషయాలను ఎంతటి సన్నిహిత మిత్రులైనా సరే, ఆఫీసులో ఎవరికీ చెప్పకూడదని ఆమె హెచ్చరించింది. ప్రొఫెషనల్ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన సరిహద్దు ఉండాలని, లేదంటే ఈ సమాచారం మీ ఎదుగుదలకు ఆటంకంగా మారే అవకాశం ఉందని వివరించారు. ఆమె చెప్పిన దాని ప్రకారం..

ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా మీ గురించి సమాచారం పంచుకునేటప్పుడు హద్దులు పాటించడం చాలా ముఖ్యం. ఎదుటి వ్యక్తి ఎంత ప్రత్యేకమైన వారైనా సరే, ఎవరితో మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి అనే విషయం తెలుసుకోవడం ముఖ్యం. ఇదే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ప్రస్తుతం, ఇలాంటి సందేశమే ఇస్తున్న ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అందులో, అమెజాన్‌లో పనిచేస్తున్న ఒక యువతి, తన అనుభవం నుండి ఆఫీసులో ఎవరితోనూ అస్సలు మాట్లాడకూడని 10 విషయాల పట్ల వివరించింది. ఆమె చెబుతున్న దాని ప్రకారం, ఈ 10 విషయాల గురించి మాట్లాడటం మీ కెరీర్‌ను ప్రభావితం చేయగలదు.

వృత్తిపరమైన సరిహద్దులు ఎందుకు ముఖ్యం?:

కార్పొరేట్ ప్రపంచంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మీరు సరదాగా పంచుకునే విషయాలు ఇతరులకు ఆయుధాలుగా మారే అవకాశం ఉంది. ఆ వైరల్ సలహాల ప్రకారం, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఇవే:

ఇవి కూడా చదవండి

జీతం వివరాలు: మీ శాలరీ ఎంత అన్నది సహోద్యోగులకు తెలిస్తే, అది అసూయకు లేదా ఆఫీసులో విభేదాలకు దారి తీస్తుంది.

ఆఫీసు రాజకీయాలు: మేనేజ్‌మెంట్ లేదా బాస్ గురించి ఫిర్యాదులు చేయడం వల్ల మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడవచ్చు.

వ్యక్తిగత ఆర్థిక సమస్యలు: అప్పులు లేదా ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పడం వల్ల మీ నిర్ణయ సామర్థ్యంపై ఇతరులకు అనుమానం రావచ్చు.

తదుపరి ఉద్యోగ వేట: మీరు మరో కంపెనీకి మారాలనుకుంటున్నట్లు ఆఫీసులో తెలిస్తే, మీకు రావాల్సిన ప్రమోషన్లు లేదా ప్రాజెక్టులు ఆగిపోవచ్చు.

గతంలోని తప్పులు: మీ పాత ఉద్యోగంలో చేసిన పొరపాట్లు ఇక్కడ చెబితే, మీ నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేసే ప్రమాదం ఉంది.

కుటుంబ గొడవలు: ఇంటి సమస్యలను ఆఫీసులోకి తెస్తే, మీరు పనిపై దృష్టి పెట్టడం లేదని బాస్ భావించవచ్చు.

ఆరోగ్య సమస్యలు: అత్యవసరం అయితే తప్ప, అనవసరమైన ఆరోగ్య వివరాలు పంచుకోకపోవడమే మంచిది. మీ ఆరోగ్యం, అనారోగ్యం గురించి అవసరమైతేనే మాట్లాడండి. మీ అనారోగ్యం లేదా వైద్య చరిత్ర గురించి ఎవరికీ అనవసరంగా చెప్పకండి. అది మీ పనిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

రాజకీయ లేదా మతపరమైన అభిప్రాయాలు: ఇవి ఆఫీసులో విభేదాలకు ప్రధాన కారణమవుతాయి. ఆఫీసు గురించి ఎవ్వరికీ తెలియని ఏదైనా రహస్య సమాచారం మీకు తెలిస్తే, దాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు.

బాస్‌తో వాదన జరిగినా లేదా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా, మీ సహోద్యోగులతో బాస్ గురించి ఎప్పుడూ మాట్లాడకండి. అది చాలా సున్నితమైన విషయం. కోపం, అంచనాలు, నిరాశలను మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ, వాటి గురించి ఆఫీసులో మాట్లాడకండి.

ఒక అమ్మాయి అనుభవం ప్రకారం, మీరు ఆఫీసులో గాసిప్ చేస్తే, అది మీ పనిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. మీరు ఫేయిల్‌ అవుతారు. మీ పనిలో అడ్డంకులను ఎదుర్కొంటారు. ఆఫీసులో స్నేహం కేవలం పనికి సంబంధించిన విషయాల వరకు ఉంటేనే శ్రేయస్కరం. మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడం వల్ల మీరు ఒక ప్రొఫెషనల్ ఇమేజ్‌ను కాపాడుకోవచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే కార్యాలయంలో మీ ప్రయాణం సురక్షితంగా, గౌరవప్రదంగా సాగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *