బరువు తగ్గాలనుకునే వారికి జొన్న ఇడ్లీలు ఒక అద్భుతమైన అల్పాహారం. జొన్నల్లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు సహాయపడి, ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. మెత్తని, స్పాంజీ జొన్న ఇడ్లీలను సులువుగా ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో,
వివరంగా తెలుసుకుందాం. జొన్న ఇడ్లీల తయారీకి కావలసినవి: జొన్నలు: 2 కప్పులు (తెల్ల జొన్నలు లేదా పచ్చ జొన్నలు), వేసుకోవాలనుకుంటే మినప్పప్పు: అర కప్పు, మెంతులు: అర టీ స్పూన్, అటుకులు: అర కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి దీనిని తీసుకోవాలి.