Headlines

మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్‌ నుంచి కొత్త మోడల్‌ బైక్స్‌ ప్రత్యేకతలు ఇవే

మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్‌ నుంచి కొత్త మోడల్‌ బైక్స్‌ ప్రత్యేకతలు ఇవే


వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు వేర్వేరు వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అవోర్​ కంపెనీ తెలిపింది. ఎంట్రీ-లెవల్ మోడల్ ఈఎక్స్1 ధర రూ. 1.23 లక్షలు కాగా, ఇందులో 3.24kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బైక్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు ఉండగా, మూడు రైడింగ్ మోడ్‌లను కూడా ఇందులో అందించారు.

EX1 కంటే మెరుగైన వేరియంట్ అయిన EX2 ధర రూ. 1.46 లక్షలుగా ఉంది. ఇందులో 5kWh బ్యాటరీ ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 255 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అందుతుందని చెబుతున్నారు. గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగానే ఉంటుంది. ఇందులో కూడా మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. సాధారణ పదిహేను యాంపియర్ సాకెట్ ఉపయోగించి బ్యాటరీని ఇరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సుమారు రెండు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.

టాప్ వేరియంట్ EX2S

ఈ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన టాప్ వేరియంట్ ఈఎక్స్2ఎస్. దీని ధర రూ. 1.70 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో కూడా 5kWh బ్యాటరీనే ఉన్నప్పటికీ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 114 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 260 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈఎక్స్2ఎస్‌లో ఐదు రైడింగ్ మోడ్‌లతో పాటు ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కూడా అందించారు. ఈ సిరీస్‌లో ఇలాంటి పెద్ద టచ్‌స్క్రీన్ ఉన్న ఏకైక మోడల్ ఇదే కావడం విశేషం. టెక్నాలజీ ఫీచర్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారులను ఈ బైక్ బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

అయితే కంపెనీ ఈ బైక్‌లకు సంబంధించిన కొన్ని కీలక వివరాలను ఇంకా వెల్లడించలేదు. కెర్బ్ వెయిట్, సీట్ హైట్, సస్పెన్షన్ సెటప్, పూర్తి ఛార్జింగ్ సమయం లాంటి స్పెసిఫికేషన్లు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అలాగే బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ, వినియోగదారులకు డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. నూతన సాంకేతికతతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు దేశీయ మార్కెట్లో ఎలాంటి స్పందనను రాబడతాయో వేచి చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *