Headlines

మతిపోగొట్టే మైలేజీతో మార్కెట్‌లోకి మహీంద్రా ఎస్‌యూవీ! పెట్రోల్ ఖర్చులకు నో టెన్షన్‌


పెట్రోల్ కార్లలో రేంజ్ కావాలి.. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే సామర్థ్యం కూడా కావాలనుకునే వారికి హైబ్రిడ్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. ఇదే ఆలోచనతో Mahindra తన భవిష్యత్ SUVలపై ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా XUV 7XOలో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిపే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ మోటార్..

Mahindra రాబోయే XUV 7XOలో Series-Parallel Hybrid Systemను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో Petrol Engine, Electric Motor, Battery Pack కలిసి పనిచేస్తాయి. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

సాధారణ పెట్రోల్ ఇంజిన్ తక్కువ వేగంలో ఎక్కువ సామర్థ్యాన్ని అందించకపోవచ్చు. అయితే హైబ్రిడ్ వ్యవస్థ అవసరాన్ని బట్టి ఎలక్ట్రిక్ పవర్‌ను ఉపయోగించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వేగం పెరిగిన తర్వాత Petrol Engine వాహనాన్ని నడపడమే కాకుండా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.

కారు వేగాన్ని తగ్గించే సమయంలో Regenerative Braking ద్వారా కొంత శక్తిని తిరిగి బ్యాటరీలోకి పంపవచ్చు. దీంతో Engine, Electric Motor, Battery మధ్య సమన్వయంతో నగర ప్రయాణాలతో పాటు హైవే డ్రైవింగ్‌లోనూ మెరుగైన సామర్థ్యాన్ని సాధించాలన్నది కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.

XEV 9Sలో మరో టెక్నాలజీ!

XUV 7XO Strong Hybridకు సంబంధించి ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన అంశం 1,000 కిలోమీటర్లకు పైగా రేంజ్. Petrol Engine, Electric Motor, Regenerative Braking కలయికతో ఈ స్థాయి రేంజ్ సాధించాలన్నది Mahindra లక్ష్యంగా తెలుస్తోంది. అయితే వాస్తవ రేంజ్ వేగం, ట్రాఫిక్, డ్రైవింగ్ విధానం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి మారుతుంది. ఫైనల్ మోడల్ విడుదలయ్యే వరకు ఖచ్చితమైన రేంజ్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదే సమయంలో XEV 9S కోసం Range-Extender Powertrainపై కూడా Mahindra పనిచేస్తున్నట్లు సమాచారం. ఇది XUV 7XO హైబ్రిడ్‌కు భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో Petrol Engine ప్రధానంగా Generatorలా పనిచేసి High-Voltage Batteryని ఛార్జ్ చేస్తుంది. Wheelsను మాత్రం Electric Motors నడుపుతాయి. దీంతో డ్రైవింగ్ అనుభూతి ఎక్కువగా EV తరహాలో ఉండే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *