అలాగే మల్లెపూలు విరగబూయాలి అంటే తప్పకుండా చెట్టుకు నీరును అందించాలి. ప్రతి రోజూ తప్పకుండా ఉదయం, సాయంత్రం తగినన్ని నీళ్లు పోయడం వలన చెట్టు ఆరోగ్యం, బలంగా ఉండి, బాగా మొగ్గలు పెట్టి ఎక్కువ పూలను ఇస్తుందంట. ఒక వేళ మీరు సాయంత్రం నీళ్లు పోస్తే ఉదయం బియ్యం కడిగిన నీరు పోయాలి అంట, మల్లె చెట్టు బాగా పూయడానికి అద్భుతమైన చిట్కా ఇది. బియ్యం నీళ్లు చెట్టుకు పోయడం వలన అది పోషకాలను గ్రహించి, ఎక్కువ పూలను ఇస్తుందంట.