Headlines

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేయకపోతే ఆన్‌లైన్ సేవలన్నీ బంద్.. ముందే అలర్ట్ అవ్వండి..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేయకపోతే ఆన్‌లైన్ సేవలన్నీ బంద్.. ముందే అలర్ట్ అవ్వండి..


పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. పీఎఫ్ ఇటీవల ఆన్‌లైన్ సేవల్లో అనేక మార్పులు చేసింది. కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత వేగవంతంగా ఆన్ లైన్ సేవలు అందించేందుకు సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దీంతో పీఎఫ్ క్లెయిమ్స్ ఆటో సెటిల్మెంట్ అవ్వడంతో పాటు పాస్ బుక్ బ్యాలెన్స్, క్లెయిమ్స్ వంటివి సులువుగా యాక్సెస్ చేయవచ్చు. వీటి కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఆన్‌లైన్‌లో ఈ సేవలన్నీ పొందాలంటే ఒకే ఒక్క కండీషన్ ఉంది. అదే కేవైసీ ప్రక్రియ. కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తే పీఎఫ్ డిజిటల్ సేవలు వేగంగా పొందవచ్చు. కేవైసీ పూర్తి చేయకపోతే మీరు సర్వీసులను పొందటంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒకవేళ మీ పాన్, ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాల్లో మార్పులు చేసుకోవాలన్నా కేవైసీ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలనేది ఇక్కడ చూద్దాం.

పీఎఫ్ ఖాతాదారులందరూ తమ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవడం అనేది తప్పనిసరి. పీఎఫ్ డబ్బు విత్‌డ్రా, ఉద్యోగాలు మారితే పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ, ఇ-నామినేషన్‌ను పూర్తి చేయడం వంటి వాటికి కేవైసీ అనేది అవసరం. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా కేవైసీ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు రిక్వెస్ట్ పెట్టుకున్న కేవైసీ వివరాలు యాక్టివ్ అవ్వడానికి యజమానులు, బ్యాంకులు లేదా పీఎఫ్ సంస్థ ధృవీకరణ అవసరం. లావాదేవీలు జరగడానికి ముందు సభ్యుల గుర్తింపును ధృవీకరించడంలో EPFOకు KYC వివరాలు సహాయపడాయి.

ఈ మూడు పూర్తి చేయండి

కేవైసీ ప్రక్రియలో భాగంగా మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్,
పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అనుసంధానించాలి. ఆన్‌లైన్ EPF విత్ డ్రా, EPF అకౌంట్ ట్రాన్సాఫర్, క్లెయిమ్‌ల పరిష్కారం, పెన్షన్ సేవలు, ఇ-నామినేషన్ పూర్తి చేయడం వంటి అనేక పనులు కేవైసీ అవసరం. ఒకవేళ లింక్ చేయకపోతే EPFO ​​సేవలను పొందడంలో ఆలస్యం జరుగుతుంది.

ఆన్‌లైన్‌లో KYCని ఎలా అప్‌డేట్ చేయాలి..?

-ఈపీఎఫ్ఓ పోర్టల్‌ ఓపెన్ చేయండి

-UAN, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి

– హోమ్ పేజీలో “మేనేజ్” కేటగిరి ఎంచుకోండి

-అక్కడ KYC ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్లలో ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారనేది ఎంచుకోండి

-అవసరమైన వివరాలను నమోదు చేయండి

-బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేస్తుంటే బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్‌, బ్రాంచ్ సమాచారాన్ని ఎంచుకోండి

-డిక్లరేషన్‌ను ఆమోదించి, సమాచారాన్ని సేవ్ చేసుకోండి

-మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

-ఆమోదం అనంతరం మీ వివరాలు అప్డేట్ చేయబడతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *