NBK111 యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా బాలయ్య ప్రమాదం భారిన పడ్డారు. మంచు మనోజ్‌తో యాక్షన్ సీన్ చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు. దీంతో వెంటనే షూటింగ్ నిలిపేసిన ఈ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బాలయ్యను పరిశీలించిన వైద్యులు.. మైనర్ సర్జరీని సూచించారని తెలుస్తోంది. ఆ సర్జరీతో బాలయ్య పూర్తిగా, వేగంగా కోలుకోవడానికి వీలువుతుందని వైద్య బృందం చెబుతోంది. బాలయ్య షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారనగానే తెలుగు టూ స్టేట్స్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. బాలయ్యకు అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు నెట్టింట తెగ వెతికింది. బాలయ్య త్వరగా కోలుకోవాలని ఆకాక్షించింది. ఈ క్రమంలోనే బాలయ్య హెల్త్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలు మరియు స్కానింగ్ అనంతరం, ఆయన మోకాలికి స్వల్పంగా కండరాల గాయం అయినట్లు నిర్ధారణ అయింది.: ఈ గాయం నుండి బాలయ్య పూర్తిగా, వేగంగా కోలుకోవడానికి మైనర్ సర్జరీ అవసరమని వైద్య బృందం సూచించింది. ఇది చాలా సాధారణ ప్రక్రియ అని, కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రొడక్షన్ హౌస్ వృద్ధి సినిమాస్ ప్రతినిధులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలకృష్ణకు కొన్ని రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని.. ఆయన కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu: ‘ప్రతి 10 మందిలో.. 8 మంది బిగ్ బాస్‌ను చూస్తున్నారా..’ పిచ్చెక్కిస్తున్న రియల్ టైం డాటా..