Headlines

పూలే.. పూలు.. మీ మల్లెచెట్టు విరగపూయాలంటే ఇదొక్కటి ఇవ్వండి.. లేట్ చేయొద్దు


పూలే.. పూలు.. మీ మల్లెచెట్టు విరగపూయాలంటే ఇదొక్కటి ఇవ్వండి..

పల్లెటూర్లలో, సిటీలల్లో ప్రతి ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటాం.. అలాంటి వాటిలో మల్లెపూల మొక్కలు ఒకటి.. ఇవి ఇంటికి అందాన్ని తెచ్చిపెట్టడటంతోపాటు.. సువాసనలను వెదజల్లుతాయి.. వాస్తవానికి మల్లె మొక్కలను పెంచడం ఆనందదాయకం.. కానీ వాటి నుండి పుష్కలంగా పూలను పొందడం అనేది సరైన సంరక్షణ, పోషణపై ఆధారపడి ఉంటుంది. చాలా మందికి మల్లె మొక్కలు పెరగకపోవడం లేదా పువ్వులు రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలకు గల కారణాలను అర్థం చేసుకొని, సరైన ఇంటి చిట్కాలను పాటిస్తే శీతాకాలం అలాగే వేసవి కాలం అంతా మీ తోట మల్లెపూలతో గుబాళిస్తుంది. నవంబర్ నెల చివరిన లేదా డిసెంబర్ నెలలో మల్లె మొక్కల సంరక్షణ చేపడితే.. ఆ తర్వాత.. ఫుల్లుగా మల్లెపూలు పూస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మొలకెత్తకపోవడానికి లేదా పెరగకపోవడానికి కారణాలు:

మల్లె మొక్కలలో కొత్తగా వచ్చే కొమ్మలకే పువ్వులు వస్తాయి. మీ మొక్కలలో కొత్త కొమ్మలు రాకపోతే, దానికి ప్రధాన కారణం మట్టిలో నత్రజని (Nitrogen), భాస్వరం (Phosphorus) పోషకాల లోపం అయి ఉండవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఈ పోషకాలు అత్యవసరం.

పెరుగుదల కోసం పరిష్కారాలు:

నత్రజని కోసం: రసాయన ఎరువులకు బదులుగా, టీపొడి లేదా కాఫీపొడిని ప్రతి 15 రోజులకు ఒకసారి అర స్పూన్ చొప్పున మొక్కలకు అందించవచ్చు. వీటిలో నత్రజని పుష్కలంగా ఉంటుంది.

కంపోస్ట్: కంపోస్ట్ ఎరువును రెండు మూడు నెలలకు ఒకసారి మొక్కలకు అందిస్తే నత్రజని లోపం ఉండదు. అంతేకాకుండా, సూక్ష్మపోషకాలు (micro-nutrients) కూడా మొక్కలకు అందుతాయి.

కొమ్మల కత్తిరింపు: మొక్కలలో బ్రాంచులు రాకపోతే, కొమ్మల చివర ఉండే రెండాకులు కింద వరకు కట్ చేయాలి. దీనివల్ల గ్రోత్ హార్మోన్ విడుదలయ్యి, పక్కల నుంచి కొత్త కొమ్మలు వస్తాయి.

మొక్క పెరిగినా పూలు రాకపోవడానికి కారణాలు:

మొక్క ఎదుగుదల బాగున్నా, కొమ్మలు వచ్చినా పువ్వులు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు:

మల్లె చెట్టు వేడి వాతావరణంలో పెరిగే మొక్క. మీ ప్రాంతంలో ఉష్ణోగ్రత 30°C కంటే తక్కువగా ఉంటే, పూలు రావడం ఆలస్యం కావచ్చు. 30-32°C ఉష్ణోగ్రతలు మల్లెపూల పెరుగుదలకు అనుకూలం. మంచి సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే మొగ్గలు ఏర్పడతాయి. తగినంత ఎండ లేకపోవడం కూడా పూలు రాకపోవడానికి ఒక కారణం. భాస్వరం (Phosphorus) మరియు పొటాషియం (Potassium) లోపించినా పూలు రావు.

అధిక పూల కోసం ఇంటి చిట్కాలు (హోంమేడ్ ఫెర్టిలైజర్స్):

ఎండిన అరటితొక్కల పొడి: అరటిపండు తిన్న తర్వాత తొక్కలను పడేయకుండా, వాటిని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది మొగ్గలు రాలిపోకుండా, చిన్న మొగ్గలు రాకుండా నిరోధించి, ఎక్కువ పూలు రావడానికి సహాయపడుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి నాలుగు నుంచి ఐదు స్పూన్ల పొడిని మొక్కలకు అందించవచ్చు. పొటాషియం తో పాటు నత్రజని, భాస్వరం కూడా ఇందులో తక్కువ మోతాదులో ఉంటాయి.

నిమ్మ తొక్కల ద్రావణం: ఎండలు ఎక్కువగా ఉన్నందున నిమ్మకాయలు ఎక్కువగా వాడుతుంటాం. వాడిన నిమ్మ తొక్కలను చిన్న ముక్కలుగా చేసి నీటిలో వేసి 24 గంటలు నానబెట్టండి. తర్వాత ఈ ద్రావణాన్ని వడకట్టి, 1:5 నిష్పత్తిలో నీటితో కలిపి మొక్కలకు ఇవ్వాలి (ఒక గ్లాసు ద్రావణంకు ఐదు గ్లాసుల నీరు). ఈ ద్రావణం నత్రజని, భాస్వరం అందిస్తుంది. అంతేకాకుండా, నిమ్మకు సహజసిద్ధంగా ఉండే ఆమ్ల (acidic) స్వభావం వల్ల మట్టి ఆమ్ల స్వభావంగా మారి, మల్లె మొక్కలకు అనుకూలంగా మారుతుంది. ఈ ద్రావణాన్ని సాయంత్రం వేళల్లో, చల్లని సమయంలో మాత్రమే ఇవ్వాలి.

ఈ రెండు ఎరువులను (అరటి తొక్కల పొడి, నిమ్మ తొక్కల ద్రావణం) ఒకేసారి ఇవ్వవచ్చు. అయితే, ఇచ్చిన తర్వాత మళ్ళీ 15 రోజుల వరకు ఎలాంటి ఇతర ఎరువులను ఇవ్వకండి. పైన చెప్పిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, మీ మల్లె మొక్కలు శీతాకాలం, వేసవి అంతా సువాసనభరితమైన పూలతో నిండిపోతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *