Headlines

Samantha: సమంతకు మగ బిడ్డ.. రాజ్ నిడిమోరు సోదరి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫొటోస్ వైరల్


స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల అమ్మగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబరులో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సామ్ నవంబర్ 20న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను స్వయంగా సమంతనే సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. తన కొడుకు పట్టుకుని ఉన్న ఫొటోని షేర్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు సమంత- రాజ్ నిడిమోరు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సమంతకు బాబు పుట్టిన తర్వాత రాజ్ నిడిమోరు సోదరి శీతల్ చేసిన పనులు అందరి దృష్టిని ఆకర్షించాయి. బుజ్జి బాబు ఆరోగ్యం, ఆయుష్షు, భవిష్యత్తు బాగుండాలని శీతల్ మూడు మతాలకు చెందిన పవిత్ర స్థలాలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రార్థనా మందిరాలకు వెళ్లి బాబు కోసం ఆశీర్వాదం తీసుకుంది. శీతల్, తన పిన్నితో కలిసి ముంబైలోని ఫేమస్ సిద్ధివినాయక టెంపుల్, హాజీ అలీ దర్గా, సెయింట్ మైఖేల్ చర్చికి వెళ్లారు. విశేషం ఏంటంటే, ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూనే ఈ మూడు చోట్లకు వెళ్లి బుజ్జి దేవ్ కోసంప్రార్థనలు చేశారు శీతల్. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘దేవ్ తమకు దేవుడిచ్చిన అద్భుతమైన బహుమతి. అమ్మ ప్రేమతో బాబుకు దిష్టి తీసినప్పుడు, అతనిపై పడే ప్రతి చూపు ఆశీర్వాదంగా మారాలి. దేవ్ మతాల హద్దుల్లో ఇరుక్కుపోకుండా అందరినీ ప్రేమించే, ప్రతి మతాన్ని గౌరవించే, మనుషులను కలిపే తెలివి ఉన్న వ్యక్తిగా ఎదగాలి’ అని ఈ సందర్భంగా కోరుకున్నారు శీతల్. అంతేకాదు, రాజ్, సమంత తమ బుజ్జి బాబుతో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారని, వాళ్ల ఫ్యామిలీలో ప్రేమ, సంతోషం ఇంకా పెరగాలని ఆమె ఆశించారు. చివరిగా ‘సర్వ మంగళాని భవంతు’ అని రాస్తూ తన ప్రార్థనను ముగించారు శీతల్.

ప్రస్తుతం రాజ్ నిడిమోరు సోదరి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు శీతల్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఫ్యామిలీలోని ఈ ఆనందాన్ని ఇలా సర్వమత సామరస్యంతో పంచుకోవడం నిజంగా స్పెషల్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక సమంత- రాజ్ లది ప్రేమ వివాహం. రాజ్ నిడిమోరు తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో సమంత కీలక పాత్ర చేసింది. ఈ సిరీస్ షూటింగ్ లోనే వీరు ప్రేమలో పడ్డారు. గతేడాది పెళ్లి చేసుకున్న వీరు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అయిపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి



రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *