Headlines

IND vs PAK: టాస్‌లో వివాదం.. మరోసారి అదే సీన్.. అసలేం జరిగిందంటే..?


IND-A vs PAK-A, Asia Cup Rising Stars 2026: ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు తెరలేచింది. ఆదివారం, నవంబర్ 22న దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న 8వ మ్యాచ్‌లో భారత్-ఎతో పాకిస్థాన్-ఎ తలపడుతోంది.

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ కెప్టెన్ అబ్దుల్ సమద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా కెప్టెన్ తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్-ఎ జట్టు బౌలింగ్‌కు దిగనుంది.

టాస్ సమయంలో వివాదం, మరోసారి నో హ్యాండ్‌షేక్..

టాస్ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు జట్ల కెప్టెన్లు తిలక్ వర్మ, అబ్దుల్ సమద్ టాస్ కోసం మధ్యలోకి వచ్చారు. సమద్ ‘హెడ్స్’ అని పిలిచాడు. నాణెం కింద పడగానే వ్యాఖ్యాత అది ‘టెయిల్స్’ అని ప్రకటించాడు, దీంతో ఇద్దరు కెప్టెన్లు కిందకు వంగి చూశారు. వెంటనే సమద్ నాణేం వైపు చూపిస్తూ మైక్‌లోకి “ఇట్స్ ఏ హెడ్, ఇట్స్ ఏ హెడ్” అని చెప్పాడు.

అంతేకాదు, ఇటీవల భారత్-పాక్ మ్యాచ్‌లలో కొనసాగుతున్న సంప్రదాయం మాదిరిగానే ఈసారి కూడా ఇరు కెప్టెన్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగలేదు. దీంతో మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రెండు జట్ల శుభారంభం..

ఈ టోర్నీలో భారత్-ఎ అదిరిపోయే ఆరంభం చేసింది. నవంబర్ 20న జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై ఏకంగా 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, రింకూ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లతో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు పాకిస్థాన్-ఎ కూడా విజయంతోనే టోర్నీని ప్రారంభించింది. యూఏఈపై 61 పరుగుల తేడాతో గెలిచి జోష్ మీద ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆ మూమెంట్ కొనసాగించాలని పాక్ భావిస్తోంది.

భారత్-ఎ vs పాకిస్థాన్-ఎ తుది జట్లు:

పాకిస్థాన్-ఎ ప్లేయింగ్ XI: షమైల్ హుస్సేన్, మాజ్ సదాకత్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, అబ్దుల్ సమద్ (కెప్టెన్), ఫర్హాన్ యూసఫ్, సాద్ మసూద్, ముహమ్మద్ ఇమ్రాన్ రంధవా, అహ్మద్ దానియల్, సుఫియాన్ ముకీమ్, అలీ రజా.

భారత్-ఎ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ (కెప్టెన్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్.

టాస్ నెగ్గిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత బౌలర్లు తొలి నుంచే ఒత్తిడి తేవాలని చూస్తారు. మరి దోహా పిచ్‌పై టీమిండియా యువ బౌలర్లు చెలరేగుతారా? పాక్ బ్యాటర్లు భారీ స్కోరు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *