
ఒక భారీ పాన్-ఇండియా విజయం బాక్సాఫీస్ లెక్కలను మార్చివేసి, రికార్డులను తిరగరాస్తుంది. కానీ, అదే విజయం ఆ హీరో తదుపరి అడుగుపై మోయలేని ఒత్తిడిని పెంచుతుంది. పాన్-ఇండియా రేంజ్ సమీకరణాలు స్టార్ హీరోలను డైలమాలో పడేస్తున్నాయి. బ్లాక్‌బస్టర్ ఇమేజ్ ఒక రకంగా బ్లెస్సింగ్ అయితే, కెరీర్ ప్లానింగ్‌లో ఇది అదనపు భారం. కేజీఎఫ్ తర్వాత యష్, బాహుబలి తర్వాత ప్రభాస్, కాంతార తర్వాత రిషబ్ శెట్టి, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా చాలా మంది స్టార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి ప్రాజెక్ట్ తర్వాత తన తదుపరి నిర్ణయంపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తరువాతి సినిమా ఎంపికలో చిన్న పొరపాటు కూడా భారీ ప్రభావాన్ని చూపే పరిస్థితిని ఈ పాన్-ఇండియా క్రేజ్ సృష్టిస్తోంది.