మన హీరోలు ప్యాన్ ఇండియన్ సినిమాల అర్థం మార్చేస్తున్నారా..? బాహుబలికి ముందు అంతా తెలుగు సినిమానే.. కానీ ఆ తర్వాత తెలుగుతో పాటు మిగిలిన ఇండస్ట్రీలపై ఫోకస్ చేసారు. ఇప్పుడు అది కూడా దాటి ప్రపంచం వైపు పరుగులు పెడుతున్నారు. ఇంతలోనే ప్యాన్ ఇండియాలోనే మరో కొత్త అర్థాన్ని వెతుకుతున్నారు. మరి ఈ లెక్కలేంటో చూద్దామా..? బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయితో పాటు బిజినెస్ రేంజ్ కూడా పెరిగింది. అయితే ప్యాన్ ఇండియా అంటే ఇన్నాళ్లూ కేవలం తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదల అంతే..! కానీ ఇప్పుడా లెక్కలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. బెంగాలీ, మరాఠీ లాంటి భాషలపై ఫోకస్ చేస్తున్నారు. ఫౌజీతో బెంగాలీలో అడుగు పెడుతున్నారు ప్రభాస్. అలాగే జపాన్ మార్కెట్‌పైనా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. ప్రభాస్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా యుఎస్, యుకే మాత్రమే కాదు.. ఈసారి జపాన్‌పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఇండియాలో మరికొన్ని భాషల్లో డబ్ చేస్తున్నారు. ఇది వర్కవుట్ అయితే నెక్ట్స్ రాబోయే స్పిరిట్, కల్కి 2 సినిమాలకు స్పాన్ పెరుగుతుంది. సేమ్ థింగ్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న రాకాకు కూడా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఫారెన్ కంట్రీస్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వారణాసి కోసమైతే రాజమౌళి ఇండియా కంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ మార్కెట్‌పైనే ఫోకస్ చేసారు. ఏదో అలా తూతూ మంత్రంగా విడుదల చేయడం కాకుండా.. ముందు నుంచే ప్రాపర్ ప్లానింగ్‌తో ఆయా దేశాల బయ్యర్స్, డిస్ట్రిబ్యూషన్ టీమ్స్‌తో కొల్లాబరేట్ అవుతున్నారు. వారణాసి, రాకాకు అదే జరిగింది. ఇలా ఒకేసారి ఇటు ఇంటా.. అటు బయటా ఒకేసారి మార్కెట్ స్పాన్ పెంచుకుంటున్నారు మన హీరోలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ …అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్
ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
దేశవ్యాప్తంగా పనీర్ బ్యాన్! 5 వేల లైసెన్సులు రద్దు!
UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?
Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్