Headlines

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు


తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు కురుస్తుండగా, సోమవారం, మంగళవారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.సెప్టెంబర్ 11, 12 తేదీల తర్వాత తెలంగాణలో వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని, మూడో వారం నుంచి భారీగా పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు, నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో ఈ నెల 11 నుంచి 13 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిస్సాలోను వర్షాల ప్రభావం మున్ముందు కూడా ఉంటుందని పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం :

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *