Headlines

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?


పెద్దపల్లి జిల్లాలోని పెద్దకల్వల, పెద్దబొంకుర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఐదారు బొమ్మలను ఆడవారి మాదిరిగా అలంకరించి, గడ్డితో జుట్టు అమర్చి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి వేలాడదీయడం ప్రజల్లో భయాందోళనలు నింపింది. ఈ ఘటన ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. ఈ భయానక దృశ్యం క్షుద్రపూజల ఆనవాళ్లా లేదా ప్రజలను భయపెట్టడానికి చేసిన పనియా అనే చర్చకు దారితీసింది. స్థానికులు ఆ చెట్టు దగ్గరకు వెళ్లడానికి జంకుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆకతాయిల పనా లేక మూఢనమ్మకాలతో ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ బొమ్మలను చివరకు తొలగించి కాల్చివేశారు.

మరిన్ని వీడియోల కోసం :

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *