ఓ బాలిక దారుణానికి ఒడిగట్టింది. కన్న తల్లిదండ్రులకు ఎలుకల మందు పెట్టి చంపడానికి ప్రయత్నించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొరేనాకు చెందిన గబ్బర్ ప్రజాపతి, మిథిలేశ్ కూతురుంది. ఆమె మైనర్. తనకు సుదేమాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆమె ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమ పెళ్లికి ఒప్పుకునేది లేదని తెగేసే చెప్పారు. ఆ మాటతో మైనర్ బాలిక కోపం పెంచుకుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారన్న కక్షతో తల్లిదండ్రులను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసింది. వారిని చంపాలని ప్రేమికులిద్దరూ నిశ్చయించుకున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూసారు. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు తినే చపాతీల్లో బాలిక ఎలుకల మందు కలిపింది. ఆ చపాతీలు తిన్న వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత దిగజారటడంతో గ్వాలియర్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు బాలికకు సంబంధించిన ఆడియో క్లిప్ దొరికింది. బాలిక తన ప్రియుడితో మర్డర్ ప్లాన్ గురించి మాట్లాడుతున్న ఆడియో క్లిప్ అది. అందులో ఏముందంటే.. ‘ఇక్కడికి దగ్గరలో ఫెర్టిలైజర్ షాపు ఉంది. అక్కడి నుంచి ఓ ప్యాకెట్ ఎలుకల మందు తీసుకురా. ఈ రోజు నేనే చపాతీలు చేస్తున్నా. ఇదే మంచి అవకాశం. నేను వాటిలో ఎలుకల మందు కలిపి వారికి పెడతాను’ అని ఉంది. పోలీసులు బాలికతో పాటు ఆమెకు సహకరించిన ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నారు ప్రేమ మత్తులో పెంచిన ప్రేమను మర్చిపోయిన కూతురిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో అత్యంత పాశవిక ఘటన జరిగింది. ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారన్న నెపంతో నవమాసాలు మోసిన తల్లిని.. ఏ కష్టం రాకుండా అడిగిందల్లా ఇచ్చి ఓ స్థాయికి తీసుకొచ్చిన తండ్రిని కన్నకూతురే అత్యంత కిరాతకంగా హతమార్చింది. నర్సుగా పని చేస్తున్న యువతి కెటామైన్ వంటి అత్యంత శక్తివంతమైన మత్తు మందును ఇంజక్షన్ రూపంలో తల్లిదండ్రులకు ఇచ్చింది. కీళ్ల నొప్పులకు ఇంజక్షన్ ఇస్తున్నానని చెప్పి.. హై డోస్ మత్తుమందు శరీరంలోకి ఎక్కించటంతో వారు స్పృహ కోల్పోయి మరణించారు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు సురేఖ నాటకమాడింది. కానీ పోలీసులు లోతుగా విచారించగా.. సురేఖ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తరువాత తమదైన శైలిలో విచారించగా.. తానే మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపినట్లు ఆమె అంగీకరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
JD Chakravarthy: స్లో పాయిజన్ ఇచ్చారు.. చావు అంచులదాకా వెళ్లా..
‘హోటల్లో పని చేస్తున్నప్పుడు చూసి చిరు అవకాశం ఇచ్చారు.. కానీ
Sridevi: జురాసిక్ పార్క్ సినిమా హీరోయిన్ ఛాన్స్ !! లైట్ తీసుకుని నో చెప్పిన శ్రీదేవి
బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??
ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!