తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం

తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం


ప్రతిబిడ్డకు తల్లే మొదటి గురువు. చిన్నారికి లాల పోస్తూ.. వెన్నెల్లో బువ్వ తినిపిస్తూ పదాలు పరిచయం చేస్తుంది తల్లి. ఆ చిన్నారి వచ్చీరాని మాటలు విని మురిసిపోతుంది. తన ఒడినే బడిగా చేసి ఓనమాలు నేర్పిస్తుంది. రామలాలీ మేఘశ్యామలాలీ అంటూ.. ఊయలలోనే మన సంస్కృతి సంప్రదాయాల బీజం నాటుతుంది. అలాంటి అమ్మకే గురువయ్యాడు ఓ కుమారుడు. దగ్గరుండి తల్లికి పాఠాలు చెప్పి పదోతరతి పరీక్షలకు సిద్ధం చేశాడు. కుమారుడితో కలిసి పరీక్షలు రాసిన ఆమె విజయాన్ని చూసి ఆ కొడుకు ఎంతగానో మురిసిపోయాడు. చదువుకోవాలనే కోరిక ఉండాలే కానీ.. వయస్సు, పెళ్లి, పిల్లలు ఏవీ అడ్డుకావు అని నిరూపించారు పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లికి చెందిన బండారు లక్ష్మి లహరి . నిరుపేద కుటుంబం కావడంతో ఆరో తరగతిలోనే చదువు ఆపేసిన అశ్విని, దశాబ్దాల తర్వాత తన కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అశ్విని కుమారుడు విజయ్ ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థిగా పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. చదువుకోవాలన్న తల్లి తపనను గుర్తించిన విజయ్.. తానే గురువుగా మారి తల్లికి పాఠాలు నేర్పించాడు. తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి పట్టుదలతో చదివారు. ఫలితాల్లో విజయ్‌కు 600కు గాను 562 మార్కులు రాగా, ప్రైవేటుగా పరీక్ష రాసిన తల్లి 500కు గాను 360 మార్కులు సాధించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చూసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అశ్విని పట్టుదలను అభినందిస్తూ ఆయన X వేదికగా ప్రశంసలు కురిపించారు. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన తదుపరి లక్ష్యమని అశ్విని గర్వంగా చెబుతున్నారు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన అశ్విని ప్రయాణం ఇప్పుడు ఎంతో మంది గృహిణులకు ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిలిండర్ ‘డెలివరీ’ మాయాజాలం.. లక్షల్లో వసూళ్లు

రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు

గోళీలే ఆయుధాలు.. షాపింగ్‌ మాల్సే వారి టార్గెట్‌

కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ‘విజయ’ కేతనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *