క్రిస్టోఫర్ చాంగ్ అనే ఓ ట్రావెలర్ తీసిన అండర్ వాటర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియో అతనూ సముద్రంలో స్కూబాడైవింగ్ చేస్తూ అండర్ వాటర్‌లో ఓ వీడియో రికార్డు చేశాడు. అయితే అతను సముద్రంలో నీటిలో ఉండగా ఓ సముద్ర తాబేలు అతనివైపునకు దూసుకొచ్చింది. అయితే సాధారణంగా తాబేళ్లు మానవులను చూస్తే క్షణాల్లో అక్కడి నుంచి దూరంగా వెళ్తాయి. కానీ ఈ తాబేటు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోకుండా చాంగ్ చుట్టూనే తిరుగడం స్టార్ట్ చేసింది.
చాంగ్‌ను చెంపదెబ్బ కొట్టిన తాబేలు
అతను ఎటు వెళ్లినా, అది తన చూట్టే తిరుగుతూ వచ్చింది. ఓ క్రమంలో ఆ తాబేలు చాంగ్‌ను గమనిస్తూ, నేరుగా అతనిపైనకు దూసుకొచ్చి అతని చెంపపై చిన్నగా కొట్టేసి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఛాంగ్ సముద్రంలో తనకు ఎదునైన వింత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. తన జీవితంలో వందల సార్లు తాబేళ్లను చూశాను కానీ, ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవ్వలేదని అతను రాసుకొచ్చాడు.
నెటిజన్ల రియాక్షన్
అయితే చాంగ్ పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చి మరీ సౌండ్ చేస్తున్నావు, అందుకే అది నిన్ను నోరు మూసుకోమని కొట్టిందని ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ చేయగా.. తాబేలు పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే అలాగే ఉంటుందని మరో యూజర్ రాసుకొచ్చాడు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.