Headlines

జబర్దస్త్ టీమ్ కారుకు ప్రమాదం.. దొరబాబుకు గాయాలు!


జబర్దస్త్ టీమ్ కారుకు ప్రమాదం.. దొరబాబుకు గాయాలు!

పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం జబర్దస్త్ టీమ్‌కు చెందిన నటులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పాలకోడేరు మండలం గొరగనమూడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ నుంచి భీమవరం వైపు వస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జబర్దస్త్ నటులు దొరబాబు, రైజింగ్ రాజుతో పాటు వాహనం డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమైందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *