Headlines

Bigg Boss Telugu 10: పెళ్లైన మహిళను పట్టుకొని అలా అంటావా? ఆ కంటెస్టెంట్‌పై రెచ్చిపోయిన నటరాజ్ మాస్టర్


Bigg Boss Telugu 10: పెళ్లైన మహిళను పట్టుకొని అలా అంటావా? ఆ కంటెస్టెంట్‌పై రెచ్చిపోయిన నటరాజ్ మాస్టర్

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 10 పదకొండో వారంలో భాగంగా నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగత తెలిసిందే. ఆడియెన్స్ ఓట్లు తక్కువగా ఉండడంతో ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె కేవలం ఆరు వారాలు మాత్రమే హౌస్ లో కొనసాగారు. ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన వెంటనే తన భర్తతో కలిసి మీడియాతో ముచ్చటించింది నీతూ మాస్టర్. ఇదే క్రమంలోనే ఆమె బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు నటరాజ్ మాస్టర్. ఈ సందర్భంగా నీతూ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ తన ఎలిమినేషన్‌ కరెక్ట్ కాదని, అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అని బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడ్డారు. తమకు ఓటింగ్ బాగానే ఉందని, కానీ ఎలిమినేట్‌ ఎందుకు చేశారో తెలియడం లేదని, బిగ్‌ బాస్‌, నాగార్జున చేస్తున్న కరెక్ట్ నా అనేది ఒకసారి చెక్‌ చేసుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో నటరాజ్‌ మాస్టర్‌ మాట్లాడుతూ, హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్‌ వంశీపై ఫైర్‌ అయ్యాడు. ఆయన బయట రౌడీనే, బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కూడా రౌడీనే అంటూ పరుష పదజాలంతో మండిపడ్డాడు.

‘ వాడు (టెంపర్ వంశీ) బయట రౌడీనే.. హౌస్ లో కూడా రౌడీనే. ఒక పెళ్ళైన లేడీ (నీతూ మాస్టర్)ను పట్టుకొని పులిహోర కలుపుతోంది.. మసాజ్లు చేస్తోంది అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. వినకూడని, వాడకూడని పదాలు మాట్లాడుతూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఇలాంటి పదాలతో ఈ షో ద్వారా జనాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు. అంటూ నటరాజ్ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాడు ఒక కంటెస్టెంటా? అసలు వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియని ఒక వ్యక్తికి హౌస్ లో కంటెస్టెంట్ గా అవకాశం కల్పించడం ఏంటి? అందులోనూ ఇంకా టాప్ ఫైవ్ అంటూ ప్రచారం చేయడం ఏంటి ? ఇప్పుడు హౌస్ మొత్తం అలయన్స్ లు పెట్టుకొని సర్వైవ్ అవుతున్నారు. ఇన్ని సీజన్లో ఇలాంటి వరస్ట్ గేమ్ , టాక్సిక్ గేమ్ ని ఎప్పుడు చూడలేదు’ అంటూ నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యారు.

నటరాజ్ మాస్టర్ వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Natraj Kasturinatraj (@natraj_master)

ఇదే క్రమంలో ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ తరఫున సెలబ్రిటీలు స్టేజ్ పైకి వచ్చినప్పుడు ప్రముఖ సీనియర్ కమెడియన్ అలీ వంశీకి సపోర్టు చేయడంతో అలీను కూడా తప్పుపట్టారు నటరాజ్ మాస్టర్. ‘ దర్శకుడు పూరీ జగన్నాథ్ వంశీ కోసమే ఆప్ డౌన్లోడ్ చేసుకొని మరి ప్రతిరోజు ఓటింగ్ వేస్తున్నాడు అంటూ చెప్పారు. ఇలాంటి వాడినా మీరు ఎంకరేజ్ చేసేది సార్ .. మీకు చెప్పేది ఒక్కటే దయచేసి మీరు అతనికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు.. యాప్స్ వెంటనే డిలీట్ చేయండి’ అంటూ నటరాజ్ మాస్టర్ కోరారు. ప్రస్తుతం టెంపర్ వంశీని టార్గెట్ చేసుకుని నటరాజ్ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

నీతూ మాస్టర్ బర్త్ డే వేడుకలు..

 

View this post on Instagram

 

A post shared by Sunaina’s fairy cake (@sunainasfairycakes)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *