ఇంకా వడగట్టిన బెల్లం నీళ్ళను మరలా పాన్ లోకి పోసి స్టవ్ ఆన్ చేసి మరిగించుకోవాలి. బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, మంచి సువాసన కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి, మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని, ఈ మిశ్రమం పాన్ నుండి విడిపోతూ, దగ్గరపడేంత వరకు ఉడికించుకోవాలి.