Headlines

కుక్క – కొండముచ్చు.. అదిరిపోయే దోస్తీ.. జాతి వైరం మరచి వీటి స్నేహం చూస్తే ముచ్చట పడాల్సిందే!


ఖమ్మం: కుక్కకి, కోతికి పడదంటారు.. కానీ ఖమ్మంలో మాత్రం రివర్స్! ఈ రెండింటి స్నేహం చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే!. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ వ్యక్తి పెంచుకుంటున్న కుక్క దగ్గరికి రోజూ గ్రామంలోని ఓ కొండముచ్చు వస్తుంది. వచ్చీరాగానే రెండూ కలిసి ఆడుకోవడం, ఒకదానికొకటి ముద్దులు పెట్టుకోవడం, ఒకదానిని ఒకటి గారాబం చేయడం చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది. సాధారణంగా కుక్కను చూస్తే కొండముచ్చు పారిపోతుంది. కొండముచ్చును చూస్తే కుక్క మొరుగుతుంది. కానీ, ఇక్కడ మాత్రం కథే వేరు. జాతి వేరైనా.. మనసు ఒక్కటైన ఈ రెండింటి అన్యోన్యతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.

మనుషుల్లో లేని స్నేహం.. మూగజీవాల్లో ఉందని అంటున్నారు. ప్రతి రోజూ సరదాగా గెంతుతూ ఉండే వీటిని చూసి స్థానికులు అబ్బురపడుతున్నారు. సహజంగా కుక్క లను చూస్తే కోతులు పరుగెత్తుతాయి. ప్రస్తుతం ఈ కుక్క – కొండముచ్చు దోస్తీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *