Headlines

విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్.. మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..


విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్.. మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా ప్రేక్షకులకు సుపరిచితమైన రష్మి గౌతమ్ ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌తో వీక్షకుల ముందుకు వస్తున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన హారర్ ఆంథాలజీ వెబ్ సిరీస్ రాత్రి. ఈ సిరీస్ తెలుగుతోపాటు తమిళ భాషల్లో ఒకేసారి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నవంబర్ 27 శుక్రవారం (నవంబర్ 26 అర్ధరాత్రి 12 గంటల నుంచి) ఈ సిరీస్ అందుబాటులోకి రానుండటంతో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. వేర్వేరు ప్రదేశాలు.. వేర్వేరు వ్యక్తులు.. కానీ భయం మాత్రం ఒక్కటే అనే ట్యాగ్‌ లైన్‌తో ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు. ఆంథాలజీ తరహాలో సాగే ఈ సిరీస్‌లో విభిన్న వ్యక్తుల జీవితాల్లో చోటుచేసుకునే భయానక సంఘటనలు, మిస్టరీలను వేర్వేరు కథలుగా చూపించబోతున్నారు. ఎం. కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన ఈ సిరీస్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల తెలుగు, తమిళ ఓటీటీలలో వచ్చిన హారర్ థ్రిల్లర్ కథలకు లభించిన ఆదరణ నేపథ్యంలో, రాత్రి కూడా భిన్నమైన అనుభూతిని పంచుతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో ఆసుపత్రి గది, పాత ఇల్లు, నివాస భవనాలు, చీకటి వీధులు, ఆలయం వంటి పరిసరాలను ఎరుపు రంగు భయానక నేపథ్యంతో ఆవిష్కరించారు. తాజాగా వచ్చిన టీజర్‌లోని ఆసుపత్రి సన్నివేశంలో ఒక డార్క్ రూమ్‌లోకి వెళ్లడానికి నర్స్ భయపడే దృశ్యాలు ఉత్కంఠను పెంచాయి. ఒక్కో కథలో ఒక్కో వాతావరణం, ఊహించని మలుపులు ఉండబోతున్నాయనే సంకేతాలను ఈ విజువల్స్ ఇస్తున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

ఈ హారర్ ఆంథాలజీలో రష్మి గౌతమ్‌తో పాటు తమిళ నటుడు నట్టి, నటి దివ్య గణేశన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. క్యారెక్టర్ పోస్టర్ల ప్రకారం నట్టి ఇందులో శబరీశన్ పాత్రలో, దివ్య గణేశన్ మంజు పాత్రలో నటిస్తుండగా, రష్మి గౌతమ్ పోషించే పాత్ర తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానున్న రాత్రి ఓటీటీ వీక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *